Ambati Rambabu : అంబ‌టిపై నిప్పులు చెరిగిన బాల‌కృష్ణ‌.. సినిమాలో చూపించుకోమంటూ రాంబాబు ఘాటు కామెంట్స్

Ambati Rambabu : మ‌రి కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సారి వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య పోటీ చాలా గ‌ట్టిగా ఉండ‌నుంద‌ని తెలుస్తుంది. ఎల‌క్ష‌న్స్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది నేత‌లు త‌మ ప్ర‌చారంతో హోరెక్కిస్తున్నారు. స‌భ‌ల్లో ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుతున్నారు. కొద్ది నెల‌ల క్రితం ఏపీ అసెంబ్లీలో ఎలాంటి ప‌రిస్థితులు నెలకొన్నాయో మనం చూశాం. తొలిరోజే టీడీపీ, వైసీపీ సభ్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సభలో మీసాలు మెలేస్తూ, తొడలు కొట్టుకుని వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.

బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన అన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరికొకరు అసెంబ్లీ వేదికగా సవాళ్లు విసురుకున్నారు. అసెంబ్లీలో బాలయ్య మీసం మెలితిప్పి సవాల్ చేయగా, మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి కౌంటర్‌ ఇచ్చారు. మంత్రి అంబటి రాంబాబు తనను చూసి తొడకొట్టారని, అందుకే తాను మీసం మెలేశానని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. చూసుకుందాం రా అన్నారని, నేను కూడా చూసుకుందాం రా అని సవాల్ చేశానన్నారు. సినీ పరిశ్రమలో అందరు తన లాగా ధైర్యవంతులు ఉండరని, ఎవరి అభిప్రాయాలు వారివన్నారు.

Ambati Rambabu sensational comments on balakrishna
Ambati Rambabu

అసెంబ్లీలో జరిగిన ఘటనలు తలుచుకుంటే బాధేస్తోందని బాలకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో శాసనసభను నడిపిస్తోందని ఆరోపించారు. సినీ రంగం నుంచి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి… ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని బాలకృష్ణ గుర్తుచేశారు. సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారన్నారు. అసెంబ్లీలో ముందుగా మీసం మెలేసి, తొడకొట్టి సవాల్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలే అని బాలకృష్ణ అన్నారు. తాను చేయని పనిని చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అతిత్వరలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు. తన వృత్తిని అవమానించిన మంత్రి అంబటి రాంబాబుకి కౌంటర్ గా తొడకొట్టి, మీసం మెలితిప్పినట్లు బాలకృష్ణ తెలిపారు. అయితే దానికి అంబ‌టి స్పందిస్తూ.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు టిడిపిలో మీసం తిప్పాలని హితవు పలికారు. తండ్రికి కష్టకాలంలో సహాయ పడలేదన్న అపవాదు మీ సోదరుల పైన ఉందని, ఇప్పుడు ఆ అపవాదు తొలగించుకునే అవకాశం వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago