CM KCR : ఈట‌ల రాజేంద‌ర్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన కేసీఆర్..!

CM KCR : తెలంగాణ‌, బీజేపీ, కాంగ్రెస్ ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఈ సారి ఎవ‌రికి వారు క‌ప్ కొట్టాల‌ని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఎవ‌రికి వారు జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయని.. రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

క‌రీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్.. హుజూరాబాద్ ప్రజలు గతంలో తనను బాధ పెట్టారని.. ఈసారి మాత్రం అలా జరగొద్దని కోరారు. పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా అంటూ తనదైన శైలిలో వాగ్బాణాలు వదిలారు. ఈ క్రమంలోనే.. ఈటల రాజేందర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే ఏమొస్తదని కేసీఆర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ గెలిచినా.. ఇన్నాళ్లుగా ఒక్క పైసా పని అయినా చేశాడా అంటూ ప్రజలను అడిగారు కేసీఆర్.

CM KCR interesting comments on etala rajender
CM KCR

ఈటల రాజేందర్ లేని రోజుల్లోనే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి గులాబీ జెండా మోశారని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రమంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి గెలవకపొతే ఏం లాభం ఉండదని కేసీఆర్ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి తన కొడుకు లాంటి వాడని.. తనతోనే హైదరాబాద్లో ఉంటాడని గులాబీ బాస్ చెప్పుకొచ్చారు. రైతుబంధు రూ.16 వేలు కావాలంటే కౌశిక్ రెడ్డి గెలవాలన్నారు.ఈటల మాత్రం తాను పార్టీని విడిన రోజు నుంచి సమయం దొరికిన ప్రతిసారీ.. కేసీఆర్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేసీఆర్ పాలనను ఎప్పటికప్పుడు తనదైన రీతిలో ఎండగడుతూనే ఉన్నారు. కేసీఆర్ రాచరికంగా వ్యవహరిస్తున్నారంటూ.. తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు ఈటల.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago