CM KCR : ఎల్ల‌కాలం నేను ముఖ్య‌మంత్రిగా ఉంటానా.. మీకొక దారి చూపించానంటూ కేసీఆర్ కామెంట్స్

CM KCR : తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత తొలి ముఖ్య‌మంత్రిగా చరిత్ర సృష్టించిన కేసీఆర్ ప‌దేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఆయ‌న‌కు ప‌రాభ‌వం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొలువుదీరనుండగా.. కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక భవనాలు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారిక భవనాలు ఖాళీ చేస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లోని తమ సామాగ్రిని షిప్ట్ చేస్తున్నారు. కేసీఆర్‌ కూడా సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి నుంచే పార్టీ కలపాలు చక్కబెడుతున్నారు.

తెలంగాణలో ఓటమితో బీఆర్ఎస్‌కు వచ్చే భయం ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ పదేళ్లలో ఓ బలమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు అదే బలంలో బలమైన ప్రతిపక్షంగా తన పాత్ర పోషించనుంది. వనరుల పరంగా పార్టీకి ఎలాంటి ఢోకా లేదు. తమ పార్టీలు కీలక నాయకులు వెళ్లిపోతారన్న భయం కూడా ఆ పార్టీకి లేదనే చెప్పాలి. ఐదేళ్లు అధికారం లేకపోయినా.. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఆ పార్టీలో ఉన్నాయి. సో ఒక్క అధికారం లేదన్న బాధ తప్పా.. పెద్దగా బీఆర్ఎస్ మరే బాధ లేదు. ఇక పోతే తెలంగాణలో జిల్లాలు, నియోజకవర్గాల్లో మాత్రమే జనం బీఆర్ఎస్‌ను వద్దనుకున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం పార్టీకి ఏమాత్రం గ్రాఫ్ తగ్గలేదు.

CM KCR first comments after their loss
CM KCR

గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ సత్తా చూపే ఛాన్సుంది. ఎందుకంటే.. గ్రేటర్ ప్రజలు కేసీఆర్ పాలనే కోరుకున్నారు కాబట్టి.. కేసీఆర్ పార్టీకి హైదరాబాద్ పై పట్టు పోలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికలను ఈ పార్టీ మరింత ప్రతిష్టగా తీసుకునే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ ఓట‌మి త‌ర్వాత ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోలో కేసీఆర్ మాట్లాడుతూ.. నేను ఎల్ల‌కాలం సీఎంగా ఉండ‌లేను. నాకు 70 ఏళ్ల దాకా వ‌చ్చాయి. ఎక్కువ కాలం ఉండ‌లేను క‌దా, పాలించుకునేది మీరే, న‌డిపించుకునేది మీరే. నేను దారి చూపించా. నేను ఎప్పుడు పోతానో తెలియ‌దు క‌దా. వెయ్యేళ్లు ఎవ‌రు బ‌త‌క‌రు క‌దా అంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం కేసీఆర్ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago