Chiranjeevi : ఒకప్పుడు రాజకీయాలలో యాక్టివ్‌గా ఉన్న చిరంజీవి తాను రాజకీయాలకి సెట్ కాను అంటూ పదేళ్ల తర్వాత తిరిగి సినిమాలలోకి వచ్చి సందడి చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ఒక వీడియో చేశారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమన్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచగళ్ల రమేష్ అని చెప్పారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, అదే పార్లమెంట్ పరిధిలోని పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచగళ్ల రమేష్ పోటీ చేయడం నిజంగా చాల సంతోషంగా ఉందన్నారు.
వీరిని గెలిపించడం వల్ల ఆయా నియోజకవర్గాలు మంచి అభివృద్దిని సాధిస్తాయన్నారు. వీటితో పాటు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని శాసనసభ స్థానాల అభివృద్దికి ఎంతగానో దోహదపడతారని చెప్పారు. దానిపై పూర్తి విశ్వాసం, నమ్మకం తనకు ఉందని తెలిపారు చిరంజీవి. ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు కూడా వీరిద్దరిపై నమ్మకం ఉంచి గెలిపించమని, ఆశీసులు వీరికి అందించమని ఈ వీడియోలో కోరారు. చిరంజీవి వ్యాఖ్యలపై అధికార వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. చిరు వ్యాఖ్యల మీద స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతివ్వటంలో తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదన్నారు. ఎంతమంది వచ్చిన ఏపీలో జగన్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ రాజకీయ తెర మీద స్పష్టత ఉందనీ.. ఏపీ పొలిటికల్ తెర మీద జగన్ ఒక్కరూ ఒకవైపు ఉన్నారు.. మరోవైపు గుంటనక్కలు, తోడేళ్లు అందరూ ఉన్నారంటూ సజ్జల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఏకమై వచ్చినా వైసీపీ విజయాన్ని, వైఎస్ జగన్ సీఎంగా కావటాన్ని అడ్డుకోలేరని సజ్జల అన్నారు. కాగా, మొన్నామధ్య విశ్వంభర సెట్లో తనను కలిసిన పవన్ కళ్యాణ్‌కు ఐదుకోట్లు విరాళంగా అందించారు చిరు. జనసేన పార్టీ కోసం ఐదుకోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…