Venu Swamy : ప్రస్తుతం ఐపీఎల్ రంజుగా సాగుతుంది.ఈ సీజన్‌లో అన్ని జట్ల కన్నా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతాలు చేస్తుంది.తామే రికార్డులు క్రియేట్ చేయడం, తామే తుడిచి వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి.. చివరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం మాములుగా విజృంభించడం లేదు. హెడ్, అభిషేక్ శర్మ, మర్‌క్రమ్, క్లాసేన్ లాంటి భీకరమైన బ్యాటర్లు ఓ రేంజ్‌లో షాట్స్ ఆడుతూ బౌలర్స్‌కి వణుకు పుట్టిస్తున్నారు. ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా తీసుకోవడం.. జట్టులోకి ట్రావిస్ హెడ్ రావడంతో.. ఆరెంజ్ ఆర్మీ బలంగా మారింది.
అయితే సన్‌రైజర్స్ అద్భుత ప్రదర్శనకు ఆ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ జాతకం కారణమని ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి చెబుతున్నారు. కావ్య మారన్ గురించి, సన్‌రైజర్స్ గురించి వేణు స్వామి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కావ్య మారన్ జాతకం బాగోలేనన్ని రోజులు సన్‌రైజర్స్ బాగా ఆడలేదు. ఇప్పుడు కావ్య మారన్ జాతకంలో యోగం బాగుంది.. ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయ్యింది. మిథున రాశి జాతకానికి సంబంధించి ఫెచ్చింగ్ స్టార్ట్ అయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి మంచి టీమ్‌ల మీద గెలుస్తోంది. అభిషేక్ శర్మ 15, 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు.
స్టేడియంలోకి అడుగుపెట్టాక అతణ్ని ఆపే శక్తి, అతడికి పేరు రాకుండా నిలువరించే శక్తి ఎవరికైనా ఉందా..? దేశంలో ఎంత పెద్ద తోపు అయినా.. ఆటగాడు స్టేడియంలో సిక్సులు కొడుతుంటే.. నోరెళ్లబెట్టి చూస్తుండటం తప్పితే ఆపలేరు కదా..?’’ అని వేణుస్వామి వ్యాఖ్యానించారు. సన్‌రైజర్స్ కప్ కొడుతుందా లేదా అనే విషయాన్ని వేణుస్వామి చెప్పలేదు గానీ.. ఇదే ఊపు కనబరిస్తే మాత్రం ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ టైటిల్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటి వరకూ రెండుసార్లు ఐపీఎల్ టైటిళ్లు గెలిచింది. 2009లో గిల్ క్రిస్ట్ నేతృత్వంలోని డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలవగా.. 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ గెలిచింది. వీరిద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు కాగా.. ప్రస్తుత సారథి ప్యాట్ కమిన్స్ కూడా ఆస్ట్రేలియన్ కావడంతో.. సన్‌రైజర్స్‌కు మూడో ఆస్ట్రేలియా కెప్టెన్ టైటిల్ అందిస్తాడని అందరు నమ్ముతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…