Chiranjeevi : తండ్రి సంవ‌త్స‌రీకం.. ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసిన చిరంజీవి..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు ఎంతో మంది అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఆ తర్వాత అగ్రహీరోగా ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరిన చిరంజీవి త‌న తండ్రిని ప‌లు సంద‌ర్భాల‌లో గుర్తు చేసుకుంటారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు. ఆయన కూడా సినిమాల్లో నటించారన్న సంగతి చాలామందికి తెలియదు.

చిరంజీవి సినిమాల్లోకి రాకముందే అంటే 1969లో విడుదలైన ‘జగత్ కిలాడీ’ సినిమాలో ఆయన చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కుటుంబ బాధ్యతల రీత్యా ఉద్యోగానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన పెద్ద కుమారుడైన శివశంకర వరప్రసాద్(చిరంజీవి)ని సినిమాల వైపు ప్రోత్సహించ‌డంతో చిరు ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు 2007లో మరణించారు. నేడు ఆయన వర్ధంతికాగా, తండ్రి సంవత్సరీకం సందర్భంగా చిరు ట్విటర్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Chiranjeevi got emotional while posting about his father
Chiranjeevi

‘మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ.. ‘ అని చిరంజీవి ట్వీట్ చేశారు. సంవత్సరీకం సందర్భంగా తండ్రికి నివాళులు అర్పిస్తూ పూజ చేస్తున్న ఫోటోలని కూడా చిరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి దంపతులు, తల్లి అంజనా దేవి, చెల్లెల్లు, నాగబాబు ఉన్నారు. పవన్ ఇత‌ర కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న నేప‌థ్యంలో తండ్రి సంవ‌త్స‌రీకం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్టు లేదు.ఇక చిరంజీవి షేర్ చేసిన ఫొటోల‌లో ఒక ఫొటోలో పవన్ కళ్యాణ్ కింద కూర్చుని ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నోడు ఎక్కడైనా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago