Chiranjeevi : స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఆయన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. చిరంజీవికి దేశ విదేశాలలో సైతం ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 1978లో ‘పునాదిరాళ్లు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిర చిరు, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 1983లో వచ్చిన ‘ఖైదీ’ అనే సినిమా.. చిరంజీవిని కెరీర్‌ను మార్చేసింది. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఖైదీ చిత్రం తర్వాత చిరంజీవికి ఎదురే లేకుండా పోయింది. ‘ఖైదీ’ తర్వాత చిరంజీవికి ఎన్నో హిట్లు వచ్చాయి. వాటిలో ‘చంటబ్బాయ్’, ‘ఛాలెంజ్’, ‘అభిలాష’, ‘శుభలేఖ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘స్వయం కృషి’, ‘రుద్రవీణ’, ‘యముడికి మొగుడు’, ‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌స మంచి పేరు తెచ్చి పెట్టాయి. 1987 నుండి 1992 వరకూ చిరంజీవివికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆరేళ్లలో ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్ లను అందుకున్నారు. పసివాడి ప్రాణం సినిమా కూడా ఈ ఆరేళ్లలో వచ్చిందే.
చిరు నటించిన యముడికి మొగుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనంతరం అత్త అల్లుడు టీజింగ్ డ్రామాతో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా వచ్చింది. ఇది సూపర్ హిట్. చిరు శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరు కెరీర్ లో చెప్పుకోదగ్గ మరో సినిమా గ్యాంగ్ లీడర్…ఈ విజయ బాపినీడు దరర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అనంతరం ఘరానా మొగుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అప్పటి వరకూ ఏ సినిమా వసూళ్లు చేయని కలెక్షన్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలా ఆరు బ్లాక్ బస్టర్ లను వరుసగా అందుకున్న చిరు మెగాస్టార్‌గా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…