Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ని ఆయన ప్రత్యర్ధులు నోటికి వచ్చినట్టు తిట్టిపోస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతరత్రా విషయాలతో పవన్‌ని దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ చాలా మౌనంగా ఉంటుంది. అయితే భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో హైపర్ ఆది .. పవన్ కళ్యాణ్ ,చిరంజీవి, రామ్ చరణ్‌లని విమర్శించే వారికి గట్టిగా ఇచ్చిపడేశాడు. అలానే దర్శకుడు బాబి కూడా తన తమ్ముడి జోలికి ఎవరైన వస్తే చిరంజీవి ఊరుకోడు అని ఓ ఉదాహరణని చెప్పుకొచ్చాడు.
చిరంజీవికి ఆయనకు ఆవేశం, కోపం రాదు అంటారు. కానీ ఓ సందర్భం చెబుతాను అని బాబి వెల్లడించారు. పవన్ కల్యాణ్ గారిది ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ పెద్ద డాక్టర్ ఇంట్లో షూటింగ్ జరుగుతోంది. లైట్ మెన్స్ షూలు, స్లిప్పర్స్ వేసుకుని ఇంట్లో నడుస్తున్నారు. అది చూసిన ఇంటి ఓనర్ పెద్దపెద్దగా అరిచేస్తున్నారట. ఇడియట్స్, స్క్రౌండల్స్ గెట్ అవుట్ అన్నారట. అది విన్న పవన్ కల్యాణ్ గారు వచ్చి మీకు ఇంటికి డబ్బులు ఇచ్చాం కదా. మీ ప్లాబ్లమ్ ఏంటీ. వాళ్లు షూస్ వేసుకోనివ్వకపోతే నేను కూడూ షూటింగ్ చేయనని వెళ్లిపోయారు” అని బాబీ తెలిపారు. పవన్ కల్యాణ్ గారు వెళ్లిపోయిన విషయం ఎవరో నిర్మాతల ద్వారా తెలుసుకున్న చిరంజీవి గారు ఆ ఇంటి ఓనర్ కు ఫోన్ చేశారు.
ఓ పది నుంచి 20 బీప్ లు. ఎవడ్రా నువ్ నా తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్లమనడానికి. నువ్వెంత నీ ఇల్లు ఎంత. సినిమా వాళ్లు కష్టపడతారని తెలిసే కదా నువ్ నీ ఇల్లు ఇచ్చింది. డబ్బులు తీసుకుంటున్నావ్ కదా అని చిరంజీవి అన్నారు అని డైరెక్టర్ బాబీ పేర్కొన్నారు. నీకు నిజంగానే నీ ఇంటి మీద ప్రేమ ఉంటే.. ఇంట్లో అందరితో ఉండి తాళం వేసుకును కూర్చో. షూటింగ్ లకు ఇవ్వొద్దు. రెంట్లు వసూలు చేయొద్దు. నా తమ్ముడు అలిగి వెళ్లి గంట అయంది కాబట్టి ఊరుకున్నా. వెంటనే తెలిస్తే వచ్చి నేనే షూటింగ్ జరిపించే వాన్ని అని ఆవేశంగా వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి గారూ ఉన్నారు. తమ్ముడిని, మనలాంటి అభిమానులను అంటే ఆయన ఊరుకోరు అని బాబీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్‌ని తిడుతున్న వారిని చిరు చూస్తూ ఊరుకోరని వారికి ఏదో రోజు సరైన బుద్ధిచెబుతారని బాబీ చెప్పకనే చెప్పాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…