మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుండగా, ఈ సినిమాపై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిరు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అనేక విషయాల గురించి స్పందిస్తున్నారు. ఇటీవల ఏపీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ సినిమాల్లో ప్రజల డబ్బుతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ ప్రజలకు చిన్న సాయం కూడా చేయలేదు. అందుకే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారు అంటూ హాట్ కామెంట్స్ చేసింది.
ఈ వ్యాఖ్యలపై చిరంజీవి తాజాగా స్పందించారు.రోజాతో తనకైతే ఎలాంటి స్పర్థలు లేవని అన్నారు చిరంజీవి. ఆమె ఏపీలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తన ఇంటికి కూడా వచ్చి కలిసి వెళ్లారని.. ఆ విషయం అందరికీ తెలుసు అని తెలిపారు. ఆమె ఎందుకు అలా మాట్లాడారో ఆమెనే అడగాలంటూ కామెంట్ చేశారు. నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అడ్డా దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. నా పేరు వాడకపోతే వాళ్ళకి గుర్తింపు ఉండదు అని చిరు స్పష్టం చేశారు..
ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నానా తో స్నేహంగా ఉన్నవారే ఇప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి వీళ్లకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని చిరు రోజాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. కొన్నిసార్లు వాళ్లను చూస్తే రాజకీయం అంటే ఇలానే ఉండాలా ? వేరే విధంగా ఉండకూడదా ? అని అనిపిస్తుంది. నేను గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అలా మాట్లాడలేదు. అది నా నైజం” అంటూ చెప్పుకొచ్చారు చిరు.