నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన పక్కా మాస్ కమర్షియల్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద టపాసుల మోత మోగిస్తున్నారు. తెరమీద బాలయ్య ఎంట్రీని తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.
కథ:
వీరసింహారెడ్డి చెల్లి అయిన భానుమతి తన అన్నమీద ప్రతీకారం తీర్చుకోవడమే సినిమా కథ. భానుమతి ప్రేమించిన వాడిని వీరసింహారెడ్డి చంపేసాడని భావిస్తుంది. ఈ క్రమంలో వీరసింహారెడ్డిపై పగ తీర్చుకునేందుకు పన్నాగాలు పన్నుతుంది. ఈ క్రమంలో వీరసింహారెడ్డికి యాంటీ పర్సన్‌ని పెళ్లి చేసుకొని అతనిని అంతమొందిస్తుంది. అయితే వీరసింహారెడ్డి నిజంగా చనిపోతాడా లేకుంటే మళ్లీ ఆయన తిరిగొచ్చి చెల్లెలికి బుద్ది చెబుతాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
వీరసింహారెడ్డి చిత్రం కథలో కొత్తదనం ఏమీ లేదని చాలా మంది అంటున్నారు. సినిమా ప్రారంభమైన సుమారు 15 నిమిషాలు కాస్త బోరింగ్‌గా ఉంటుంది.. ఆ తరవాత నుంచే అసలు సినిమా మొదలవుతుంది. బాలయ్య యాక్టింగ్, డైలాగులు, యాక్షన్ బ్లాక్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు బలాలు. యాక్షన్ కాస్త అతిగానే ఉంది. బట్ బాలయ్య ఫ్యాన్స్‌కి మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఫైట్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి.వరలక్ష్మీ శరత్‌కుమార్ చాలా బాగా నటించారు. మొత్తం మీద ‘వీరసింహారెడ్డి’ సినిమా బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతుంది..సాధారణ ప్రేక్షకులకు మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా అఖండ మాదిరిగా బాగా ఆడొచ్చు.