Chiranjeevi : రాజకీయాలలోకి వెళ్లి తిరిగి సినిమాలలోకి వచ్చిన చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం భోళా శంకర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అనే పేరున్న మెహర్ రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. అయితే విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా దారుణంగా డ్రాప్ అయ్యాయి. దాదాపు 140 కోట్ల ( ప్రచార కార్యక్రమాల ఖర్చుతో కలిపి) భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు..
భోళా శంకర్’కి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు రూ. 3.13 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక రెండు రోజులకు కలిపి ఈ చిత్రం కేవలం రూ. 18.51 కోట్లు షేర్, రూ. 27.45 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక మూడో రోజు కలెక్షన్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయి. డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఆచార్య సైతం మూడు రోజుల్లో 45 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ భోళా శంకర్ సినిమా మాత్రం కేవలం 40కోట్లు మాత్రమే వసూలు చేసి.. అటు చిరంజీవికి, ఇటు నిర్మాతకు, ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. భోళా శంకర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 40 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 40.50 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. అయితే ఇప్పట్లో అందుకోవడం కష్టంగానే అనిపిస్తోంది.
భోళా శంకర్ ఫ్లాప్ టాక్ తర్వాత చిరంజీవి గురించి కాకుండా కోటి గురించి స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమలోకి తాను అడుగుపెట్టి 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 40దేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రకటించారు. ఇందుకు తనకు విషెస్ తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ ఎఫెక్ట్‌తో చిరంజీవి కొన్నాళ్లు రీమేక్‌ల జోలికి వెళ్లబోడని సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…