Meher Ramesh : భోళా శంక‌ర్ డైరెక్ట‌ర్‌కి చుక్క‌లు చూపించిన ఫ్యాన్స్.. త‌ల ప‌ట్టుకున్నాడుగా…!

Meher Ramesh : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం భోళా శంక‌ర్. ఈ చిత్రం ఆగ‌స్ట్ 11న గ్రాండ్‌గా విడుద‌లైంది. చిరంజీవి న‌టించిన గ‌త చిత్రం వాల్తేరు వీర‌య్య మంచి హిట్ కొట్ట‌డంతో భోళా శంక‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ని అలరిస్తుంద‌ని ఫ్యాన్స్ భావించారు. కాని చిత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది.చిరంజీవి కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌గా ఈ సినిమా నిలిచింద‌ని అంటున్నారు. ప‌దేళ్ల త‌ర్వాత చిరంజీవి లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ మెహ‌ర్ ర‌మేష్‌కి ద‌క్క‌గా, దానిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. రీమేక్ సినిమాని కూడా చెడ‌గొట్టి మెగా ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. కంత్రి, బిల్లా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మార్కులు వేయించుకున్న మెహర్ రమేష్ 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో శక్తి సినిమాను తెరకెక్కించారు.అయితే ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్ కు ఏకంగా 22 కోట్ల రూపాయల నష్టం మిగిల్చింది.

జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో శ‌క్తి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల‌వ‌గా, ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సైతం విమర్శలు వచ్చాయి.శక్తి సినిమా డిజాస్టర్ అయినా మెహర్ రమేష్ పై నమ్మకంతో విక్టరీ వెంకటేష్ షాడో సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చారు.అయితే ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. భోళా శంక‌ర్ సినిమా కూడా చేదు ఫలితం ఎదురైంది.అనిల్ సుంకర 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఈ సినిమా కోసం ఖర్చు చేయగా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.మెహర్ రమేష్ ను నమ్మడమే హీరోల పాలిట శాపమైందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

chiranjeevi fans angry on Meher Ramesh
Meher Ramesh

అయితే సినిమా రిలీజ్ రోజు అభిమానుల‌తో క‌లిసి థియేట‌ర్‌లో మూవీని వీక్షించారు మెహ‌ర్ ర‌మేష్‌. కొన్ని సీన్స్ లో ఫ్యాన్స్ రియాక్ష‌న్ చూసి సంతోష‌ప‌డిన మిగ‌తా సినిమా అంతా కూడా చెత్త‌గా ఉంద‌ని ప‌లువురు కామెంట్స్ చేయ‌డం ఆయ‌న‌ని బాధ పెట్టింది. ఇక అభిమానుల తాకిడి, అలానే కొంద‌రు సినిమాపై నెగెటివ్ గా మాట్లాడ‌డం మెహ‌ర్ ర‌మేష్‌కి అస్స‌లు న‌చ్చ‌లేదు. కొంద‌రు ప్రేక్ష‌కులు దారుణంగా మాట్లాడ‌డంతో ఆయ‌న చాలా ఇబ్బంది ప‌డ్డాడ‌ని తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago