Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, మంచి సేవా దృక్పథం ఉన్న మనిషిగా చిరంజీవి ఎందరో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎంత సంపాదించామన్నది కాదు సమాజానికి ఎంత తిరిగి ఇచ్చామన్నది చిరంజీవి పాటిస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు తన కుటుంబం, తన సంపాదన, తన ఆస్తుల పెంపు అన్నట్లుగా వ్యవహరించేవారు. కాని తర్వాత తర్వాత ఆయనలో చాలా మార్పులు వచ్చాయి. 1980 నుంచి ఆయన ఈ ఛారిటీ మోడ్ లోకి వచ్చినా.. 1988 నుంచి పూర్తి స్దాయిలో కనస్ట్రక్టివ్ గా ఛారిటీలకు ఓ రూపం కలిగిస్తూ ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాండ్ నెలకొల్పారు.
ఏటా తాను రక్తదానం చేస్తూ తన అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలో యువతను ఆ దిశగా నడిపిస్తూ వచ్చారు. కోవిడ్ టైమ్ లోనూ నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. మెగాస్టార్ ఇప్పుడు పూర్తిగా దాన, ధర్మాలపైనే ఫోకస్ పెట్టారు. అందుకే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మెగాస్టార్ ఇంతగా దానాలు చెయ్యడం వెనుక ఓ కారణం ఉంది. దాని గురించి ఇటీవల చిరంజీవి వివరించారు. “ఎంతో స్టార్డం చూసిన గొప్ప గొప్ప నటులు, దర్శక, నిర్మాతలు తమ చివరి దశల్లో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చూశారు. ఎంత సంపాదించినా చివరికి ఏమి కూడబెట్టుకోలేకపోయారు.
అందుకే, నేను మా కుటుంబానికి ఆస్తులు కూడబెట్టాలి అన్నట్లుగా ఉండేవాడిని . ఇప్పుడు ఆ అవసరం లేదు. మా పిల్లలు అందరూ జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఇప్పుడు నేను కూడబెట్టాల్సింది ఏమి లేదు,” ఇప్పుడు కోట్ల రూపాయల దానాలు చేస్తున్నారు చిరంజీవి. “ఇకపై నా జీవితం ఛారిటీకే అంకితం. ఎంతైనా దానం చేస్తాను. చేస్తున్న సినిమాల ద్వారా వస్తున్న డబ్బు కూడా ఛారిటీకే ఉపయోగిస్తున్నా అని అన్నారు. ప్రతిరోజు నాలుగైదు లక్షలు ఆయన దానం చేస్తుంటారు.. లక్ష, రెండు లక్షలు ఇలా చాలా వరకూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. కానీ ఆయన చేసిన దానం గురించి పబ్లిసిటీ చేసుకోరు. ఈ విషయాలు చాలామందికి తెలియదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…