Chiranjeevi : వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మెహర్ రమేష్‌కి కీలకం కావడంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన భోళా శంకర్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి అభిమానులు ఆసక్తికరంగా గమనిస్తుండగా, చిరు ఎప్పటిలాగే తన లీక్స్ ద్వారా ఫ్యాన్స్ కి ఫుల్ ఫన్ అందిస్తున్నారు. ఆ మధ్య షూటింగ్ లొకేషన్ విజువల్స్ షేర్ చేసిన చిరంజీవి తాజాగా భోళా శంకర్ చిత్రంలోని సంగీత్ నేపథ్యంలో వచ్చే సాంగ్ కి సంబంధించిన వీడియో చిరు లీక్ చేశారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్రలో నటిస్తోంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంగీత్ సాంగ్ కోసం కలర్ ఫుల్ గా గ్రాండ్ సెట్ ఏర్పాటు చేశారు. షూటింగ్ కి ఆర్టిస్టులు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇక చిరు కీర్తి, తమన్నా లతో ముచ్చట్లు పెట్టుకుని తెగ అల్లరి చేస్తున్నారు. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ,ఏస్తున్నాడని అర్ధమవుతుంది. కమెడియన్లు వెన్నెల కిషోర్, రఘుబాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, వైవా హర్ష కూడా కనిపిస్తున్నారు.
సెట్ మొత్తం ఆర్టిస్టులు, మెగాస్టార్ హంగామాతో సందడిగా ఉంది. చిరు అయితే కీర్తి సురేష్, తమన్నా లతో ఉంటూ బాగా హంగామా చేస్తున్నారు. ఒక సందర్భంలో చిరు కీర్తి సురేష్ గొంతుని సరదాగా పట్టుకోవడం కూడా చూడొచ్చు. సంగీత్ సాంగ్ అయినప్పటికీ ‘జామ్ జామ్ జామ్ జజ్జినక తెల్లార్లు ఆడుదాం తైతక్క’ అంటూ హుషారెత్తించే లిరిక్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది. స్టార్ కాస్టింగ్‌తో చిత్రం రూపొందుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…