Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వివాదాలకి చాలా దూరంగా ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం ఆయనని ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తూ చిరంజీవిపై మాత్రం ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో చెర్రీపోషించిన సీతారామరాజు పాత్రకు మంచి పేరొచ్చింది. హాలీవుడ్ ప్రముఖులు సైతం రామ్‌చరణ్ నటనని ఆకాశానికి ఎత్తారు.
ఇటీవల హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర తనకు ఎంతో నచ్చేసిందంటూ కితాబు ఇచ్చారు. ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని, ఒక్కసారి అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు. అక్కడే దర్శకుడు విజయం సాధించాడని చెప్పుకొచ్చారు. అయితే చెర్రీ నటన హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కి నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
జేమ్స్ కామెరాన్ సర్… మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవం. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనలు’ అని తన ట్విట్టర్‌లో తెలియజేశాడు. అయితే ఇందులో ఎన్టీఆర్ కూడా నటించాడని, ఆయన పేరు ప్రస్తావించకపోవడం ఏంటని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే మగధీర సమయంలో చరణ్ వల్లే సినిమా హిట్ అయింది అంటూ మెగా క్యాంప్ ప్రచారం చేసుకుంది అని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆచార్య డిజాస్టర్ అయితే మాత్రం ఆ నెపం దర్శకుడి మీదికి నెట్టేశారు అని వారు ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఎంత రచ్చగా మారుతుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…