11 సార్లు సంక్రాంతికి పోటీ ప‌డ్డ చిరు, బాల‌య్య‌.. గెలుపెవ‌రిది..?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్ద‌రు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి సినిమాలకున్న పోటీ మరే హీరోకు ఉండదనేదని కాద‌న‌లేనివాస్తవం. అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు. వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా ఉండదు. వీరిద్దరు బాక్సాఫీస్ బరిలో 11 సార్లు తలపడ్డారు. 1985 నుంచి ఇప్పటి వరకు బరిలో పోటీ పడిన వీరు మరోసారి పందెలోకి దిగి మంచి విజ‌యం అందించారు.

చిరంజీవి-బాలకృష్ణ తొలిసారిగా సంక్రాంతి బరిలో 1985లో పోటీ పడ్డారు. చట్టంతో పోరాటం సినిమాతో మెగాస్టార్, ఆత్మబలం చిత్రంతో బాలయ్య పండగ సీజన్‌లో తలపడ్డారు. 1987లో చిరంజీవి దొంగమొగుడు సినిమాతో సంక్రాంతికి సందడి చేశారు. ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 1988లో చిరంజీవి మంచి దొంగ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేశారు. జనవరి 14న ఇది విడుదలైంది. జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి కూడా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. 1989లో మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచారు. జనవరి 14న అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదలై సూపర్ హిట్ అందుకుంది.

chiranjeevi balakrishna competed with each other sankranthi

దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత సంక్రాంతి సీజన్‌లో తలపడ్డారు. 1997 జనవరి 4న హిట్లర్ చిత్రంతో చిరంజీవి సందడి చేశారు. హిట్లర్‌లో ఐదుగురు సిస్టర్స్ సెంటిమెంటు ఉండగా.. పెద్దన్నయ్య చిత్రం ముగ్గురు సోదరుల మధ్య అనుబంధాన్ని చూపించారు. అనంతరం రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య-చిరంజీవి పండగ సీజన్‌లో పోటీ పడ్డారు. ఈ సినిమా జనవరి 13న విడుదలైంది. అయితే ఈ రెండింట్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్టవగా.. స్నేహంకోసం చిత్రం మాత్రం యావరేజ్‌గా నిలిచింది. 1997లో దర్శకుల కాంబినేషన్ మరోసారి 2000లోనూ రిపటైంది. హిట్లర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ముత్యాల సుబ్బయ్య అన్నయ్య చిత్రంతో మరోసారి మెగాస్టార్‌ను సంక్రాంతి బరిలో నిలిపారు. బాలకృష్ణకు పెద్దన్నయ్య లాంటి సక్సెస్ ఇచ్చిన శరత్.. వంశోద్ధారకుడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

అనంతరం ఏడాది తర్వాత మెగాస్టార్-బాలయ్య మరోసారి సంక్రాంతి సీజన్‌లో పోటీ పడ్డారు. 2001 జనవరి 11న చిరంజీవి మృగరాజు సినిమాతో సందడి చేశారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోపక్క అదే రోజున బాలకృష్ణ బీ గోపాల్ దర్శకత్వంలో నరసింహానాయుడుతో సందడి చేశారు. సమరసింహారెడ్డి కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమా కూడా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అంజి-లక్ష్మీనరసింహా..ఖైదీ నెంబర్ 150- గౌతమిపుత్ర శాతకర్ణి.. వీరసింహారెడ్డి-వాల్తేరు వీరయ్య.. ఇలా ఈ అగ్రహీరోలు ఇద్దరూ ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా.. చాలా సార్లు ఇద్దరి చిత్రాలు సక్సెస్ అందుకున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago