నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది.. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ చూసేందుకు అభిమానులు థియేటర్లకి క్యూ కట్టారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. సినిమా విడుదలైన మొదటిరోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.25.36 కోట్లు వచ్చాయి. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన 15వ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డ్ పుష్ప సినిమాపై ఉంది. పుష్ప మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజులో రూ.24.90కోట్లు రాబట్టగా, ఆ రికార్డ్ ను వీరసింహారెడ్డి తిరగరాసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఫస్ట్ హాఫ్ లో వీర సింహారెడ్డి పాత్ర గూస్ బంప్స్ సీన్లు అన్నీ ఉండటం సినిమాకు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అయింది. సింహ, లెజెండ్, అఖండ సినిమాల తరహాలో వీరసింహారెడ్డి స్క్రీన్ ప్లేను ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అని కొందరు అంటున్నారు.. ఫస్ట్ హాఫ్ తరహా గూస్ బంప్స్ సీన్లు సెకండ్ హాఫ్ లో లేవు. అందుకే సెకండ్ హాఫ్ కొంతమంది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని అంటున్నారు.
సినిమాలో 20 నిమిషాల సన్నివేశాలను కట్ చేసి ఉంటే సినిమా పర్ఫెక్ట్ గా ఉండేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మోతాదుకు మించి సినిమాలో ఫైట్లు ఉన్నాయని ఫ్లాష్ బ్యాక్, రివర్స్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ అయిందని అంటున్నారు. వీరసింహారెడ్డి, భానుమతి పాత్రల మధ్య బాండింగ్ సీన్లు మరి ఆకట్టుకునే స్థాయిలో లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే అదిరిపోయేదని కొందరు చెప్పుకొస్తున్నారు. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే దూకుడుతో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…