Chiranjeevi : సినిమా పరిశ్రమలో నటీనటులు, లేదా దర్శక నిర్మాతలు లేకుంటే నటులు దర్శకుల మధ్య విభేదాలు రావడం సహజమే. అయితే కొన్ని రోజుల వరకే ఆ విభేదాలు తర్వాత అందరు ఒక్కటిగా ఉంటారు. టాలీవుడ్ లో మేటి నటుడు చిరంజీవి కాగా.దిగ్గజ దర్శకుడిగా దాసరి నారాయణ రావు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు .అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే.150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు మెగాస్టార్ చిరు.. నటనలో ఎన్నో మెళకువలు పొందిన చిరంజీవి అగ్ర దర్శకులు అందరితో సినిమాలు చేశాడు. అయితే దర్శకుడు దాసరి,మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఒకే ఒక్క సినిమా రావడం విశేషం.
దాసరికి 100వ సినిమాగా లంకేశ్వరుడు చిత్రం రాగా, చిరంజీవి సినిమాల్లోకి వచ్చి 11 ఏండ్ల తర్వాత దాసరి దర్శకత్వంలో ఈ సినిమా చేశారుమెగాస్టార్ .1989 అక్టోబర్ 27న ఈ మూవీ విడుదలైంది.ఈ సినిమాకి ముందు దాసరి-చిరంజీవి కాంబినేషన్ మూవీ ఎప్పుడు వస్తుందో అని ఇండస్ట్రీలో టాక్ వినిపించేది. ఎట్టకేలకు సినిమా రూపొందగా, ఇందులో డబ్బున్నవాళ్లను దోచుకొని లేనివాళ్లకు పంచిపెట్టే శివశంకర్ గా చిరంజీవి నటించాడు. ఆయన సరసన రాధ హీరోయిన్ గా చేసింది. సత్యనారాయణ, మోహన్‌బాబు, రఘువరన్ విలన్ పాత్రలు చేయగా, .చిరంజీవి చెల్లెలిగా రేవతి నటించింది.ఆమె భర్తగా కల్యాణ చక్రవర్తి యాక్ట్ చేశారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి దాసరిలకు మధ్య కొన్ని గొడవలు జరిగాయట. దాసరి నారాయణరావు ఆ సమయం లో స్టార్ డైరెక్టర్ కాగా చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. అయితే గొడవల వలన దాసరి నారాయణరావు లేకుండానే చిరంజీవి సినిమాలోని రెండు పాటలు మినహా అన్ని పాటలను చిత్రీకరించారట. నిర్మాత వడ్డే రమేష్ ఆ తర్వాత ఇద్దరినీ చాలా ప్రయత్నం చేసి కలిపి షూటింగ్ పూర్తి చేయించినట్టు టాక్. అలా సినిమా పూర్తి అయిన తర్వాత అప్పట్లో ఈ చిత్రాన్ని భారీ రేటుకు అమ్మగా, చిత్రం ఫ్లాప్ టాక్ పొందడతో నిర్మాతకు భారీ నష్టాలనే మిగిల్చింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…