Chinthamaneni Prabhakar : ప్రస్తుతం పవన్ కళ్యాన్ సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయాలలోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి పక్షాలు పవన్‌ని విమర్శిస్తున్నారు. ఆయన వాటికి ధీటుగానే బదులిస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా బదులిచ్చారు. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటూ తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనను నాణేనికి ఓ వైపే చూశారని, రెండో వైపు కూడా చూసి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. హీరో అనే విషయం పక్కన పెడితే, ఓ రాజకీయ నాయకుడిగా నీకంటే నేనే ఎక్కువ అన్నారు.
నీ సామాజిక వర్గం కూడా నా వైపే తమ్ముడూ అంటూ పంచ్‌లు విసిరారు.. నేను ఓ నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తిని అని, నువ్వు రాష్ట్రానికి చెందిన వ్యక్తివని, తనపై మాట్లాడటం ద్వారా నువ్వు నియోజకవర్గానికి దిగజారి, తనను పెద్ద చేస్తున్నావన్నారు. తమ్ముడూ అంటూ మాట్లాడారు. ఇక నీ అన్న ఏమైన శ్రీరామ చంద్రుడా.. పార్టీని తీసుకెళ్లి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో కలిపాడు. అయితే దీనిపై ఏరోజైన ప్రజలకు తెలియజేశావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు టీడీపీ పార్టీ సీటు అవ్వకపోయిన ఏదో ఒకటి చేసుకొని బతుకుతా అని అన్నారు.
![Chinthamaneni Prabhakar : పవన్ కళ్యాణ్.. నీ అన్న ఏమన్నా శ్రీరామ చంద్రుడా.. ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని.. Chinthamaneni Prabhakar angry on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/06/chinthamaneni-prabhakar.jpg)
పవన్ కళ్యాణ్.. నువ్ ఒక రాష్ట్ర పార్టీ అధినేతవు. కానీ, నియోజకవర్గ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావ్. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటున్నావ్. ఆ మాటలు నీకు బాగనిపిస్తే.. రిజిస్టర్ చేసుకో.. సినిమాలకు బావుంటాయి. కానీ, సగటు మనిషినైన నాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు’ అని చింతమనేని అన్నారు. ప్రభాకర్ అన్న వాళ్లనే ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేస్తావు. హోదా కోసం ఢిల్లీకి వెళ్లి ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. హోదాకు మించిన ప్యాకేజీ అంటే నువ్వు పాచిపోయిన లడ్డూ అన్నావని, ఆ పాచిపోయిన లడ్డూ కూడా కేంద్రం ఇవ్వలేదని, కానీ తమ్ముడూ.. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు నీకు నోరు రావడం లేదా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.