దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ కామన్‌గా ఓ నటుడు కనిపిస్తుంటాడు. ఆయన పేరు చంద్రశేఖర్. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్’లోనూ కీలక పాత్రలో నటించాడు. ఆర్టిస్టుగా ‘ఛత్రపతి’ సినిమా చంద్రశేఖర్‌కు మంచిపేరు తీసుకొచ్చింది. అప్పటి నుంచి నటుడిగా నిలదొక్కుతున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే నటుడిగా అందరికీ పరిచయమున్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నది మాత్రం పెద్దగా తెలియకపోవచ్చు.
చంద్రశేఖర్ భార్య పేరు నిలియా భవాని. కిక్ 2 సైరా నరసింహారెడ్డి, జెంటిల్మాన్, పండగ చేస్కో వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది భవాని. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన భవాని చంద్ర శేఖర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు హైదరాబాద్ కు వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కు ఛాన్స్ లు వచ్చాయి.
చంద్రశేఖర్ ముందుగా రాజమౌళి ఈటీవీలో తెరకెక్కిస్తున్న శాంతినివాసం సీరియల్ లో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇక కొంతకాలం అయిన తర్వాత భవాని శేఖర్ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకోగా, వీరిద్దరికి ఒక కొడుకు ఒక పాప ఉన్నారు. ఇద్దరూ భవాని వద్దే ఉంటున్నారు. కూతురు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చుదువు తుంది. అలాగే కొడుకు క్రికెటర్ గా స్థిరపడాలని ప్రయత్నిస్తున్నాడు. స్టూడెంట్ ‘నం.1’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు చంద్రశేఖర్. అప్పటినుంచి వరుస అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయాడు. భర్త అడుగుజాడల్లో నీలియా భవానీ కూడా ఇండస్ట్రీలోకి ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకుంది.