Chandra Babu : లైవ్ లో వీడియో వేసి జ‌గ‌న్ ప‌రువు తీసిన చంద్ర‌బాబు

Chandra Babu : మ‌రి కొద్ది రోజుల‌లో ఏపీలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇప్ప‌టి నుండే జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందా అని ప్రతి ఒక్క‌రు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇక చంద్ర‌బాబు-జ‌న‌సేన మాత్రం ఈ సారి అధికారం ద‌క్కించుకోవ‌డం ఖాయం అన్న‌ట్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ కనిపించారు. రా కదలిరా పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్న చంద్రబాబు, నిన్న తునిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట తప్పారని చెప్పేలా తన ప్రసంగం మధ్యలో ఓ వీడియో ప్లే చేశారు. ఆ వీడియో చూపిస్తూ జ‌గ‌న్ బండారం బ‌య‌ట‌పెట్టాడు.

జగన్ మాటలు విని మోసపోవద్దని ప్రజలను చంద్రబాబు హెచ్చరించారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తరలించాలని తాను భావిస్తే జగన్ దానిని నాశనం చేశాడన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి రాయలసీమను సస్య శ్యామలం చేస్తానని చెప్పుకొచ్చారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు అయినా వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పైసా కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదన్న చంద్రబాబు అంగళ్లలో తనపై తప్పుడు కేసులు పెట్టి పైశాచికానందం పొందారన్నారు. ‘సైకో జగన్‌కు.. ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుంది. ఐదేళ్లలో ప్రజల జీవిత ప్రమాణాల్లో మార్పు వచ్చిందా? కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీగా టీడీపీకి పేరుంది. త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుంది. ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలి.

Chandra Babu showed video of cm ys jagan
Chandra Babu

పేదరికం లేని సమాజం చూడాలనే ఎన్టీఆర్ కలను సాకారం చేస్తానని, పేదరికం నుంచి ప్రతి ఒక్కరూ బయటపడేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్ అని, నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు అంటే జగన్‌కు లెక్క లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆదాయంతో సమానంగా వడ్డీలు, అసలు కట్టే పరిస్థితి లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని, పెంచిన ఆదాయంతో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago