Chandra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. దాదాపుగా అన్ని పార్టీల నాయకులు ఎన్నికల మోడ్ లోకి వెళ్లిపోయి ప్రచారాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇన్నాళ్లు సాదా సీదాగా ప్రచారాలు చేసిన నాయకులు ఇప్పుడు టాప్ గేర్ వేసి జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాయకుల కొమ్ము కాసే మీడియా సంస్థలు సైతం వారిని హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు చంద్రబాబు వెంట ఉన్న ఎల్లో మీడియా ఇప్పుడు ఆయనకు విశ్వసనీయత కోల్పోయినట్లు స్పష్టంగా చెప్పింది. మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో చంద్రబాబు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల కారణంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ముందు చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు రాసుకొచ్చింది.
జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిందని పేర్కొంది.2019 ఎన్నికలకు ముందు బీజేపీతో శతృత్వంపెట్టుకుని తప్పుచేస్తే, ఇప్పుడు అదే బీజేపీతో చేతులు కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల మళ్ళీ నష్టపోతామని పార్టీలోని తమ్ముళ్ళే చంద్రబాబుతో చెబుతున్నారట. సొంత ఆలోచనలను ఎప్పుడో కోల్పోయిన చంద్రబాబు ఎల్లో మీడియా పోరును భరించలేక బీజేపీతో తీవ్రంగా విభేదించారు. ఏకకాలంలో ఇటు జగన్మోహన్ రెడ్డితో అటు మోడీతో తలపడే సీన్ చంద్రబాబుకు లేదని ఎల్లో మీడియా చెప్పేసింది. జగన్ బాధను తప్పించుకోవాలంటే మోడీ ముందు సాగిలపడక తప్పదని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.
![Chandra Babu Naidu : చంద్రబాబుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎల్లో మీడియా.. అసలేం జరిగింది..! Chandra Babu Naidu got difficult situation](http://3.0.182.119/wp-content/uploads/2023/06/chandra-babu.jpg)
మోడీకి దగ్గరవ్వాలన్న ప్రయత్నాల్లో చంద్రబాబు ప్రతిపక్షాలన్నింటికీ దూరమయ్యారని చెప్పింది. జగన్ దెబ్బను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లు పరోక్షంగా ఎల్లో మీడియా తేల్చి చెప్పడం గమనర్హం. అమిత్ షాతో చంద్రబాబు భేటీపై వైసీపీ చేస్తున్న విమర్శలకు కూడా సరైన జవాబిచ్చే స్థితిలో చంద్రబాబు లేరట. ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి చివరకు ఇలా అయిపోయిందని ఎల్లో మీడియా తెగబాధపడుతూ చెప్పింది.. రాజకీయంగా చంద్రబాబు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే విశ్వసనీయత కోల్పోవటానికి ప్రధాన కారణమని కూడా తేల్చింది.