CBI Ex JD Laxmi Narayana : తెలంగాణలో ప్రస్తుతం ‘బర్రెలక్క’ ఓ సంచలనం. కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్… ఇలా రాజకీయాల్లో తలలుపండిన వారు పోటీచేస్తున్న ఎన్నికల్లోనే కర్నే శిరీష్ అలియాస్ బర్రెలక్క పోటీచేస్తుండడం ఆమెకి జోరుగా మద్దతు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని ఈమె పేరు పైన పేర్కొన్న నాయకులతో సమానంగా వినిపిస్తోంది. సామాన్యురాలిగానే ఎన్నికల బరిలో దిగిన బర్రెలక్క ఇప్పుడు అసామాన్యురాలిగా మారింది. రోజురోజుకు ఆమెకు పెరుగుతున్న క్రేజ్, మద్దతు చూసి ప్రధాన పార్టీల్లో గుబులు మొదలయ్యింది.
మాజీ ఐపిఎస్ జేడి లక్ష్మీనారాయణ, ఒకప్పటి హీరో, ప్రస్తుతం మతబోధకుడు రాజా, యానాంకు చెందిన ప్రముఖ రాజకీయ మల్లాడి కృష్ణారావు వంటివారు బర్రెలక్కకు ఇప్పటికే మద్దతు తెలిపారు. బర్రెలక్క ఎవరికి బెదరకుండా చాలా ధైర్యంగా పోటీ చేస్తుందని, ఆమె తెగువ తెగ నచ్చిందని లక్ష్మీనారాయణ అన్నాడు. పవన్ కళ్యాణ్ కన్నా కూడా ఆమె చాలా బెటర్ అనేలా పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు జేడి. ఏపీలో బీజేపీతో కటీఫ్ చెప్పుకున్న జనసేన.. తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకుంది. ఏకంగా 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరి ఏపీలో వద్దనుకుని.. తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం ఏంటి.. పవన్ ప్రదర్శిస్తోన్న ఈరెండు నాల్కల ధోరణి ఏంటో అర్థం కాక జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రమే జనాలు కూడా విస్తుపోతున్నారు.
![CBI Ex JD Laxmi Narayana : బర్రెలక్కకి అండగా నేనున్నా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర కామెంట్స్.. CBI Ex JD Laxmi Narayana sensational comments on barrelakka](http://3.0.182.119/wp-content/uploads/2023/11/cbi-ex-jd-laxmi-narayana.jpg)
ఇక పవన్ తీరు ఇలా ఉండగా.. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బర్కెలక్క అలియాస్ కర్నె శిరీష అసెంబ్లీ బరిలో నిలవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాజాగా బర్రెలక్కపై వర్మ కూడా ఆసక్తికర కామెంట్ చేశారు. బర్రెలక్క నేటి మహాత్మాగాంధీ… మహాత్ముడి లాగే అన్యాయానికి వ్యతిరేకంగానే బర్రెలక్క పోరాటం కూడా ప్రారంభమయ్యిందని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈమెను చూస్తుంటే పవన్ కల్యాణ్ కంటే సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఇలా పవన్ తెలంగాణ ఎన్నికల ప్రచారంపై స్పందిస్తూ శిరీష్ పై ప్రశంసలు కురిపించారు వర్మ.