Bro Movie Public Talk : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం `బ్రో`. `భీమ్లా నాయక్`వంటి సూపర్ హిట్ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తుందీ మూవీ. ఇందులో సాయిధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో రూపొందించిన `వినోదయ సిత్తం` చిత్రానికిది రీమేక్. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.నేడు విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులని అలరించినట్టు తెలుస్తుంది.
మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు సినిమా బాలేదని, ల్యాగ్ ఎక్కువైందని, కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయని అంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్ ఫార్మెన్స్ అదరగొట్టాడని చెబుతున్నారు. సినిమా ప్రతి ఒక్క మెగా అభిమానిని అలరించేలా ఉందని కొందరు అంటున్నారు. మొత్తానికి అయితే అటు సాయిధరమ్ తేజ్, ఇటు ఫవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్ చేరినట్టే అని కొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం థియేటర్స్ అయితే కళకళలాడుతున్నాయి.
ఇక కొన్ని థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. అలాగే ఏపీలోని శ్రీకాకుళంలో ఓ థియేటర్ లో ‘బ్రో’ బెనిఫిట్ షో రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఆ థియేటర్ లో సాంకేతిక కారణాల వల్లే షో వేయలేదని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ థియేటర్ ముందు రచ్చ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సర్దిచెప్పారు. ఆ తర్వాత షోలు ప్రదర్శించబడ్డాయి. ఇక మిగితా అన్ని ఏరియాల్లో ‘బ్రో’ మేనియా దుమ్ములేపుతోంది. ఏపీలోని పార్వతీపురం సౌందర్య థియేటర్ లో అభిమానులు రచ్చరచ్చ చేశారు. సంబరంలో మునిగిపోయి ఏకంగా థియేటర్ లోని స్క్రీన్ నే చింపేశారు. దీంతో థియేటర్ యజమానులు సినిమాను నిలిపేశారు. ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగిందనే చెప్పాలి.