Brahmanandam : అన్‌స్టాప‌బుల్ ట్రైల‌ర్ లాంచింగ్‌లో బ్ర‌హ్మానందం సూప‌ర్బ్ ఫ‌న్.. న‌వ్వుకున్న చిత్ర బృందం..

Brahmanandam : బిగ్‌బాస్ విన్నర్ విజె సన్నీ , సప్తగిరి హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘అన్‌స్టాపబుల్’ . డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎ2 బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్ రావు నిర్మించారు. నక్షత్ర , అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. రీసెంట్‌గా మేక‌ర్స్ ట్రైల‌ర్ వేడుక నిర్వ‌హించారు ఈ కార్యక్రమానికి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘యంగ్‌స్టర్స్ అందరూ కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్‌కు నా వంతుగా సహకారం అందించాలని ఈ వేడుకకు వచ్చాను అని అన్నారు.

దాదాపు యాభై మంది నటీనటులతో ఈ సినిమా చేయడం ఆనందాన్నిచ్చింది. సన్నీ, సప్తగిరి, బిత్తిరి సత్తి, షకలక శంకర్, పృథ్వీ, చమ్మక్ చంద్ర.. ఇలా ఎంతోమంది నటీనటులతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. జంధ్యాల, రేలంగి నరసింహరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారి సినిమాల్లో ఇలా తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్ళీ ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చి అన్‌స్టాపబుల్ వంటి మంచి ఎంటర్‌టైనర్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది అని బ్ర‌హ్మానందం అన్నారు.

Brahmanandam comedy in unstoppable event
Brahmanandam

యువ దర్శకులు, నటులు, నిర్మాతలని ప్రోత్సహించాలి. అప్పుడే పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది. ఈ సినిమాని నిర్మించిన యువ నిర్మాతలు రజిత్ రావు, రఫీలకి ఆల్ ది బెస్ట్. చిత్ర బృందం అంతా కష్టపడి చేసిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుతున్నాను. ఇందులో వున్న నటులని చూస్తుంటే ముప్ఫై ఏళ్ల క్రితం ఇలానే ఉండేవాడిని కదా అని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరిని మీరందరూ ఆశీర్వదిస్తే పెద్దవాళ్ళు అవుతారు. గొప్పవారు అవుతారు. తర్వాత ప్రతి ఒక్కరూ ఒక బ్రహ్మానందం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బ్ర‌హ్మానందం అన్నారు. అలానే రిపోర్ట‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కి ఫ‌న్నీగా స‌మాధానాలు చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago