Varahi : ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో పవన్ ప్రత్యేకంగా వారాహి అనే ప్రచార రథం తయారు చేయించుకున్నారు. ఈ రథం ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు నెల రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వారాహి గురించి చర్చలు నడిచాయి.ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో బహిరంగ సభలని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాహనం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అయితే కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర జరిపిన పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇచ్చేందుకు ఆయన అభిమాని ఏకంగా మినీ వారాహి వాహనాన్ని తయారు చేశాడు.
పార్టీకి చెందిన ఓ మహిళా నేత కుమారుడే ఈ విధంగా పవన్ పై అభిమానాన్ని చాటుకున్నాడు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో జనసేన ఎంపీటీసీ జక్కంపూడి విజయలక్ష్మి శ్రీనివాస్ కుమారుడు తన అభిమాన నటుడిపై ప్రత్యేక అభిమానం చూపిస్తూ.. వారాహి పోలికలతో ఓ చిన్న వాహనం తయారు చేసాడు. ప్రస్తుతం ఏపీ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతున్న వారాహిని చూసి మినీ వారహిని తయారు చేశాడు. ఆ బుడతడు ఈ మినీ వారాహిని తయారు చేయడానికి సుమారు 10 రోజులు సమయం పట్టింది. దీనిని పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆయనకు బహుమతిగా ఇవ్వటం కోసం తయారు చేశానని బాలుడు చెప్పుకొచ్చాడు.
బాలుడు స్వయంగా పవన్ కళ్యాణ్‌ని కలిసి ఆ మినీ వారాహిని గిఫ్ట్‌గా అందించాడు. పవన్ ఇది చూసి తెగ ఖుష్ అయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న పవన్ దృష్టిని ఆకర్షించేందుకు పలువురు వెరైటీ గిఫ్ట్స్ అందిస్తూ ఇస్తున్నారు. వాటిని పవన్ కూడా ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ మినీ వారాహి వాహనం కూడా రూపుదిద్దుకుంది. ఇది ఇప్పుడు పవన్ అభిమానుల్ని కూడా ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…