సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ నటులలో ఒకరు బాబీ సింహా..ఈయన తమిళనాట ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. హీరోగా విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా బాబీ సింహ ప్రస్తుతం ఉన్న డిమాండ్ మామూలుది కాదు..రీసెంట్ గా విడుదలై సంచలన విజయం సాధించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఒక విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఈయన గురించి మన ఆడియన్స్ కి చాలా తక్కువ మాత్రమే తెలుసు..తమిళం లో తెరకెక్కిన ‘జిగర్తాండ’ అనే సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ బాబీ సింహా కి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డు దక్కింది.
తెలుగు లో ఇదే సినిమాని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’ అని రీమేక్ చేసాడు..బాబీ సింహా పోషించిన పాత్రని వరుణ్ తేజ్ చేసాడు..ఇక్కడ కూడా మంచి హిట్ అయ్యింది ఈ సినిమా. బాబీ సింహా పేరుకే తమిళ నటుడు..కానీ ఇతను ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని మెగాస్టార్ చిరంజీవి మొన్న జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తే కానీ ఎవరికీ తెలియలేదు..వాస్తవానికి ఇతను హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతం లో 1983 వ సంవత్సరం నవంబర్ 9 వ తారీఖున జన్మించాడు.
బాబీ సింహా సొంత ఊరు విజయవాడ సమీపం లో ఉన్న బందర్ ప్రాంతంలో..తన విద్యాబ్యాసం మొత్తం నాల్గవ తరగతి వరకు మౌలాలి లో ఆ తర్వాత కృష్ణ జిల్లా మోపిదేవిలో ప్రియదర్శిని విద్యాలయంలో 10వ తరగతి వరకు పూర్తి చేసి , డిగ్రీ విద్యాబ్యాసం కొరకు కోయంబత్తూరు కి వెళ్ళాడు. తమిళ్ లో దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే 2016లో తోటి నటి రేష్మి మీనన్ ను బాబీసింహా ప్రేమ వివాహం చేసుకున్నాడు. బాబీ సింహా కుటుంబం వ్యవసాయం చేయడం కోసం తమిళనాడుకు వలస వెళ్లగా అక్కడే స్థిరపడ్డారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా చేసిన హైదరాబాద్ లవ్ స్టోరీ అనే చిత్రంలో,అలాగే తెలుగు హీరో సాయి రామ్ శంకర్ నటించిన నేనోరకం అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. రేష్మీ మీనన్.