Bhuma Akhila Priya : ఇటీవల మంచు ఫ్యామిలీలో మనోజ్ పెళ్లి వేడుక జరగడంతో అంతా సంతోషంగా కనిపించారు. వైభవంగా జరిగిన ఈ వివాహంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విజయమ్మ, భూమా అఖిల ప్రియ దంపతులు, రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక మంచు లక్ష్మీ ఈ పెళ్లి వేడుకని అన్నీ తానై చేసింది. ఈ వేడుకకి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్న సమయంలోనే మంచు ఫ్యామిలీ లో జరిగిన గొడవ రచ్చకెక్కింది. చిన్న గొడవే అయినా .. ఇప్పుడు అది చిలికి చిలికి గాలివానగా మారింది.
విష్ణు సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు మంచు విష్ణు. తన బంధువులను కొడుతున్నడని ఓ వీడియోను షేర్ చేశారు మనోజ్. దాంతో వీరిద్దరి మధ్య గొడవ రోడ్డున పడింది. మంచు విష్ణు – మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేస్తుండగా.. ఉన్నట్టుండి మనోజ్ పెట్టిన ఓ వీడియో సంచలనంగా మారింది. అన్న మంచు విష్ణు ఆగడాలు ఇవీ అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి షాకిచ్చారు మంచు మనోజ్. మంచు వారింట జరుగుతున్న ఈ గొడవ బట్టబయలు కావడంతో జనాల్లో డిస్కషన్స్ షురూ అయ్యాయి.
మంచు విష్ణు, మనోజ్ నడుమ మధ్య ఏం జరిగింది? అసలు గొడవకు కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం కాగా, దీనిపై మంచు లక్ష్మీ రీసెంట్‌గా స్పందిస్తూ.. ఇది చిన్న గొడవే అని, కావాలనే దీనిని పెద్దదిగా చేస్తున్నారని వాపోయింది. అయితే ఈ వివాదంపై భూమా అఖిల ప్రియకు కూడా ఓ ప్రశ్న ఎదురైంది. తాజాగా మీడియాతో మాట్లడిన ఆమె పార్టీ మారడం గురించి మాట్లాడుతూ.. తాను టీడీపీని వీడేది లేదు అని చెప్పుకొచ్చింది. ఇక మంచు ఫ్యామిలీ గొడవలపై కూడా ప్రశ్న ఎదురుకాగా, అది వారి కుటుంబం విషయం. వాళ్లనే అడిగితే బాగుంటుంది. దానికి నేనేం చెబుతాను అంటూ ఆ వివాదంపై స్పందించేందుకు నిరాకరించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…