Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి కుర్రహీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి వినోదం పంచారు. ప్రస్తుతం భోళా శంకర్ అనే చిత్రం చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మెహర్ రమేష్ వహిస్తుండగా, నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు.
భోళాశంకర్ కథ గురించి చూస్తే.. చిరంజీవి తన చెల్లిని ఆర్ట్స్ కాలేజ్‌లో జాయిన్ చేయించడానికి కోల్‌కతా వెళాతాడు.అయితే చిరు క్యారెక్టర్ ఇందులో చాలా ఇన్నో సెంట్‌గా, అమాయకంగా ఉంటారు. అపరిచితుడు చిత్రంలో పంతులు మాదిరిగా భోళా శంకర్ క్యారెక్టర్ ఉంటుందట. చిరు మంచి తనం చూసి ఇంటి ఓనర్ క్యాబ్ డ్రైవర్ జాబ్ వెతికి చూపిస్తాడట. తర్వాత తన చెల్లి ఓ వ్యక్తిని ప్రేమించడం జరుగుతుంది.అప్పుడు చిరు వారిద్దరితో మాట్లాడి పెళ్లి చేస్తాడు. ఆ సమయంలో ఓ పోలీస్ ఆఫీసర్ కొందరు క్రిమినల్స్‌ని మీడియాకి రిలీజ్ చేస్తాడు. అయితే అందులో ఒక క్రిమినల్ చిరుకి కనిపించడంతో పోలీసులకి అప్పజెబుతాడు.
అయితే పోలీస్ వాళ్లని మీడియా ఎవరు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు అని అడగగా, అప్పుడు పోలీస్ ఇన్‌ఫార్మర్ అని చెబుతాడు. అప్పుడు భోళాశంకర్ పోలీస్ ఇన్‌ఫార్మర్ అనుకొని అతడిని కిడ్నాప్ చేస్తారు. అతడిని షూట్ చేస్తుండగా, అతడిలోని మరో యాంగిల్ బయటకు వస్తుంది. వరుసగా క్రిమినల్స్‌ని మట్టుపెడుతుంటాడు. చిరు వరుసగా ఎందుకు క్రిమినల్స్ ని ఎందుకు మట్టుపెడుతున్నాడు అనేది ఇంటర్వెల్ తర్వాత తెలుస్తుంది. కోల్ కతాకి రాకముందే చిరు చాలా రౌడీ బాయ్‌గా ఉంటారు. అయితే క్రిమినల్స్ అమ్మాయిలని కిడ్నాప్ చేసి వేరే దేశానికి తరలిస్తుంటారు. వారిని మట్టుబెట్టి కాపాడతారు చిరు. ఇది సినిమా బ్రీఫ్ స్టోరీ..దీనిని చాలా రిచ్‌గా మెహర్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…