Balagam Venu : కొన్ని కథా చిత్రాలు ప్రేక్షకులని ఇట్టే కట్టి పడేస్తుంటాయి. అలాంటి వాటిలో బలగం చిత్రం ఒకటి. చిన్న సినిమాగా వచ్చి ప్రజల మనసులు దోచింది మూవీ. అంతే కాదు ఎందరో అన్నా చెల్లెల్లు.. అన్నాతమ్ములను కూడా కలిపింది ఈసినిమా. మెగాస్టార్ నుంచి ఇండస్ట్రీ పెద్దలంతా.. అద్భుతం అని మెచ్చుకున్న ఈ సినిమా ఇటీవల థియేటర్లలో 50రోజులు పూర్తి చేసుకుంది. మంచి ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాకు.. జబర్థస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించగా, ఇందులో ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కమర్షియల్‌గా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
అయితే తాజాగా ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్‌ని శ్రీదేవి డ్రామా కంపెనీలో అపహాస్యం చేశారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఇందులో బలగం చిత్రంలోని కొన్ని సీన్స్‌ని పేరడీతో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ కామెడీ చేశారు. బలగం దర్శకుడు వేణు ముందే వాళ్ళు కామెడీ చేయగా, కొందరు దీనిపై పెదవి విరుస్తున్నారు. అందుకు కారణం చిత్రంలో కొమరయ్య మరణించే సన్నివేశాలు,ఆ తర్వాత కాకికి పిండం పెట్టే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి.
ఆ సన్నివేశాలలో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, భాస్కర్ నటించి కామెడీ పండించారు.. చివర్లో బలగం తరహాలో జబర్దస్త్ ప్రవీణ్ పాట పడుతూ హైపర్ ఆది, రష్మీ ఇలా ఒక్కొక్కరి గురించి కామెడీగా వివరించి అలరించాడు. రష్మీ గురించి పాట పాడుతూ.. గాలోడు గాలోడు అంటే గాలికి పోయాడు.. ఈమె ఇక్కడే ఉండిపోయింది అంటూ ప్రవీణ్ నవ్వించారు. అయితే అంత ఎమోషనల్ సీన్‌ని ఇలా కామెడీ చేయడం ఏంటని కొందరు తిట్టిపోస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది. బలగం సినిమాను హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి నిర్మించగా… ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సౌండ్‌ట్రాక్‌లను సమకూర్చారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఇక ఈమూవీ ఎన్నో అవార్డ్ లను సైతం సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…