Bengaluru Padma : సీరియల్స్‌లోను, సినిమాలలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించి ఎంతగానో అలరించారు బెంగళూరు పద్మ.ఈ మధ్య కాలంలో ఆమె సినీ పరిశ్రమకి కాస్త దూరంగా ఉన్నారు. అయితే అప్పుడప్పుడు పలు సీరియల్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అయితే పద్మ కూతురు గాయత్రి కూడా నటి కాగా, ఆమె హ్యాపీ డేస్ సినిమాలో అప్పుగా కనిపించి ఎంతో మంది మనసులు గెలుచుకుంది. హ్యపీడేస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంలో అప్పు పాత్ర కూడా కీలకమనే సంగతి తెలిసిందే.అయితే తర్వాత రోజుల్లో గాయత్రీ రావు కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. అయితే తాజాగా అప్పు తల్లి బెంగుళూరు పద్మ ఓ ఇంటర్వ్యూలో అప్పుకు సినిమా కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీడేస్ ఆ సినిమా కోసం బాయ్ కట్ చేయించుకోవాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పడంతో.. కాస్త ఇబ్బంది పడిందని…బాయ్ కట్ చేయించుకున్నాక కూడా చాలా బాధపడి ఏడ్చిందన్నారు. ఆ తర్వాత హ్యాపిడేస్ సినిమాలో అప్పు క్యారెక్టర్ చూసి అంతా బావుందని మెచ్చుకున్నారని పద్మ అన్నారు. తన కూతురు ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లో నటించిన తర్వాతే .. గాయత్రి ఇక సినిమాలు చేయకూడాదని నిర్ణయం తీసుకుందన్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ముందుగా గాయత్రి క్యారెక్టర్ ట్రయాంగిల్ లవ్ అని చెప్పి తీసుకున్నారన్నారు. ఆ తర్వాత సినిమాలో విడుదలయ్యాక.. వేరేలా డిఫరెంట్ టాక్ వచ్చిందన్నారు. సినిమా చేశాక తాను ఇక సినిమాలు చేయనని చెప్పిందన్నారు. సినిమాలు మానేసి చదువుకుందన్నారు. పీజీ పూర్తి చేసిందన్నారు. ఏదీ ఏమైనా వారి వల్లే ఇవాళ నా కూతురు మంచి నిర్ణయం తీసుకొని లైఫ్‌లో స్థిరపడిందన్నారు. హ్యాపీడేస్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో సెటల్ అయిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…