Bendapudi Students : బెండపూడి విద్యార్ధులు అంటే వారి ఇంగ్లీష్ మనకు ఠక్కున గుర్తొస్తుంది. కాకినాడ జిల్లాలోని బెండపూడి హైస్కూల్‌లో విద్యార్థులు అమెరికన్ ఇంగ్లీష్ తరహాలో మాట్లాడతారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. జగన్ అక్కడి విద్యార్ధులని ప్రశంసించడం కూడా మనం చూశాం. అయితే వారు అమెరికా ఇంగ్లీష్‌ను ఉచ్ఛరించడం అంతా ఒట్టిదేనని తర్వాత తేలింది. కేవలం అది బట్టీయే అని, గొప్పల కోసం బయటకు ప్రచారం చేయడం కోసమే కొందరు విద్యార్థులను ఎంపిక చేసి డబ్బా కొట్టించారన్న నిజం తేలిపోయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉషా కుమారి బెండపూడి హైస్కూల్‌ను సందర్శించారు.
ఆ సమయంలో విద్యార్ధులతో ఆమె మాట్లాడగా,కేవలం బట్టిపట్టిన అమెరికా ఆంగ్లం మినహా కొత్తగా ఏం ప్రశ్నలడిగినా విద్యార్థులు నీళ్లునమలడంపై ఉషాకుమారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుమానం వచ్చి లోతుగా ఆరా తీస్తే కేవలం జగన్ ప్రభుత్వానికి ప్రచారం కల్పించడం కోసమే ఇక్కడ ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో కొందరికి అమెరికా ఇంగ్లీష్‌లో గతేడాది నుంచి శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. సీఎం పర్యటనలో ఎవరో కొద్దిమందితో బట్టీ పట్టించి ఆంగ్లంతో అధికారులు మమ అనిపించినట్లు తేలిపోయింది. ఇప్పుడు బెండపూడి విద్యార్ధులు ఏకంగా పవన్ కళ్యాణ్‌ని కలిసి అక్కడి పరిస్థితులని చెప్పుకొచ్చారు.
![Bendapudi Students : పవన్ దగ్గరికి వచ్చిన బెండపూడి ఇంగ్లిష్ స్టూడెంట్స్.. ఏమన్నారంటే..? Bendapudi Students came to pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/06/bendapudi-students.jpg)
స్కూల్‌లో కనీస వసతులు లేవు అని, దాదాపు 500 మంది అమ్మాయిలు ఉండగా, వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్‌కి తెలియజేశారు. ఆరో తరగతిలో ఉన్నప్పుడు బాత్ రూంలు కట్టిస్తామని చెప్పారని, పదో తరగతి వచ్చిన కూడా వాటిని పట్టించుకునే నాథుడే లేరని చెప్పారు. బాత్ రూంకి వెళ్లలన్న కూడా డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చిందని తమ బాధని తెలియజేసారు. వారి మాటలు విన్న పవన్ కళ్యాణ్ తగిన న్యాయం జరిగేలా చూస్తానని చెప్పుకొచ్చారు.