Beer Load : అసలే సమ్మర్.. అందులో ఎండలు భీబత్సంగా మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లని పానీయం తాగాలని ఎవరైన తహతహలాడుతుంటారు. మద్యం ప్రియిలైతే రేటు ఎక్కువ పెట్టి కూడా బీర్ బాటిల్స్ దక్కించుకుంటున్నారు. అయితే ఫ్రీగా దొరికితే ఎవరు మాత్రం వదులుతారు. బీరు బాటిళ్లతో వెళుతున్న వ్యాన్ బొల్తా పడటంతో ఒక్క సారిగా జనాలు ఎగబడ్డారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లు చేతికి అందినన్ని బాటిళ్లను ఏ మాత్రం ఆలోచింకచకుండా ఎత్తుకెళ్లారు. అటుగా వెళుతున్న వాళ్లు, బస్సులో ప్రయాణీకులు కూడా చంకలో రెండు, ఒక చేతిలో రెండు, మరో చేతిలో రెండు ఇలా బాటిళ్లు పట్టుకుని వెళ్లిపోయారు. ప్రమాదంలో కొన్ని బాటిళ్లు పగిలిపోగా, మరి కొన్ని అట్టపెట్టెల్లో ఆలాగే పడిపోయాయి.
పగిలిన బాటిళ్లు తప్ప అట్టపెట్టెల్లోని బీరు బాటిళ్లు మొత్తం జనాలు తీసుకువెళ్లిపోయారు. దొరికినోడికి దొరికినంత అన్నట్టు అటుగా వెళుతున్న వారందరు కూడా బీర్ బాటిల్స్ తీసుకొని పోయారు. అయితే ఈ ప్రమాదం అనకాపల్లి లోని కసికోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై జరిగింది. బీర్ల లోడు వ్యాన్ అనకాపల్లి డిపో నుండి నర్సీపట్నం డిపోకు వెళుతుండగా బొల్తా కొట్టింది. దీంతో బీర్లు నేలపాలు అయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
పోలీసుల ఎంట్రతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీర్ బాటిల్స్ తీసుకెళుతున్న సమయంలో కొందరు యువకులు తమ సెల్ ఫోన్ లో జనాలు బీరు బాటిళ్లు ఎత్తుకెళ్లుతున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అలాంటిది ఏదో మనదగ్గర జరిగిన బాగుండేది కదా అని కొందరు మనసులో అనుకుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…