Bandla Ganesh : ఒకప్పుడు కమెడియన్‌గా అలరించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారడం, రాజకీయాలలోకి వెళ్లి తిరిగి రావడం ఇటీవల పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారడం వంటివి చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పూరీ భార్య లావణ్యను పొగుడుతూ ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు అని, అలాగే ఆకాష్ ను మెచ్చుకుంటూ.. కన్న కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ఏం చేస్తున్నావ్ అన్నా అంటూ దారుణంగా మాట్లాడాడు బండ్ల.
ఇక తాజాగా ఐడ్రీమ్ నాగరాజుకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో వ్యాపారాలు, వ్యాపకాలు వంద ఉన్నాయి.. వాటిని పక్కన పెట్టి రాజకీయాల్లో ఎందుకు వేలు పెడుతున్నారని అడగ్గా.. తానేక్కడ వేలు పెట్టానని బండ్ల అన్నారు. పోసాని చావు మాములుగా ఉండదంటూ బండ్ల అన్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. అన్న నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. కానీ బండ్ల గణేష్ పడడు. కేటీఆర్ గారు అంటే ఆన్సర్ ఇస్తా.. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా.. పోసాని అంటే ఆన్సర్ ఇస్తా.. లింక్‌లు పెడితే చెప్పను.. అంటూ నాగరాజుతో కొంచెం ఘాటుగానే మాట్లాడాడు.
తన మీద కోపం ఉంటే తనను కొట్టాలని.. తిట్టాలని.. అంతేగానీ మధ్యలో మా అమ్మానాన్న ఏం చేశారని ప్రశ్నించారు బండ్ల. గతంలో బండ్ల గణేష్‌ను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా.. భార్యను, బిడ్డలను ప్రేమించనోడు మనిషా అన్న అంటూ బండ్ల ఫైర్ అయ్యారు. పూరీకి మంచి, చెడు చెప్పే హక్కు తనకు ఉందని.. అతను తన ఫ్రెండ్ అని అన్నారు. మా ఎన్నికల సమయంలో కోటా శ్రీనివాసరావును నాగబాబు విమర్శించడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు అని అడగ్గా.. నన్ను ఇరికించాలని చూడకు అన్న అంటూ బండ్ల సున్నితంగా చెప్పారు. లవ్ వన్‌సైడ్ ఉంటోందేమో గానీ.. వార్ వన్‌సైడ్ ఉండదన్నారు. మొత్తానికి ప్రోమో మాత్రం చాలా వాడివేడిగానే ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…