Bandla Ganesh : కమెడీయన్‌గా తెలుగు ప్రేక్షకులని అలరించి ఆ తర్వాత నిర్మాతగా సత్తా చాటిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక పనిచేస్తూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటారు. షాద్ నగర్ ప్రాంతంలో పౌల్ట్రీ వ్యాపారిగా ఉన్న బండ్ల గణేష్.. తర్వాత సినిమాల్లో కమెడియన్ గా చేశారు. తర్వాత నిర్మాణ రంగంలోకి వచ్చారు. కొన్ని భారీ సినిమాలు తీశారు. ఇటీవలి కాలంలో హీరోలు కాల్షీట్లు ఇవ్వకపోవడంతో సినిమాలు తీయడం లేదు. అయితే.. రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా స్పందిస్తున్నారు. ఎవరైనా ఏపీలో పవన్ ను విమర్శిస్తే వారికి కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. తాను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనని.. గాంధీభవన్ లో చెబుతూంటారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. తాను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనని.. ఇంతవరకు కాంగ్రెస్ కి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందని.. ఇప్పుడు దేశం కోసం రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీలు సేవ చేస్తున్నారని అన్నారు బండ్ల గణేష్. కురుక్షేత్ర మహా సంగ్రామంలో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అన్నిటికి తెగించి తెలంగాణ ఇచ్చింది అమ్మ.. సోనియా గాంధీ అని అన్నారు.
రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణాలోనే మాకాం వేస్తారని చెప్పారు.రాహుల్ గాంధీ ఏనాడు హద్దులు దాటి మాట్లాడలేదన్నారు. బీఆరెస్ లో మంత్రులు ఎవరు.. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు ఎవరనేది సంబంధం లేదని.. తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతడం ఖాయమని బండ్ల గణేష్ నమ్మకం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లోనూ బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ ఉన్న మహాకూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఓ సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని సవాల్ చేశారు. అది బ్లేడ్ చాలెంజ్ గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. తనకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…