Bandaru Satyanarayana : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు… ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘‘జగన్మోహన్ రెడ్డి నీకు నీ కేసులకు భయపడతాం అనుకుంటున్నావా క్వశ్చనే లేదు. భయపడం. చివరి క్షణం వరకు పోరాడుతాం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది’’. ప్రశ్నించే గొంతును నొక్కేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా.. వంద రోజులు లెక్కపెట్టుకో జగన్మోహన్ రెడ్డి తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలే తేలుస్తారు. చంద్రబాబు అరెస్టు గురించి జగన్‌కు తెలియదనడం హాస్యాస్పదం. నిన్ను దొంగ అనాలా….? గజదొంగ అనాలా ….? ఇంకా ఏమైనా అనాలా జగన్.
ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నావు జగన్.. తెలుగు దేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి వైసీపీకి చెమటలు పడుతున్నాయి. నీ నిజాయితీ ఏంటో నీ ఆస్తులు ప్రకటించి నిరూపించుకో. పవన్ కళ్యాణ్‌తో కలిసి బలమైన ప్రభుత్వాన్ని నిర్మిస్తాం. రోజా గురించి తెలుసు కాబట్టి వైసీపీ సోదరీమణులు ఎవరు స్పందించడం లేదు’’ అంటూ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించడం, విమర్శించడం రాజకీయ నాయకుల హక్కు అని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. గుంటూరు పోలీసులు 41 ఏ నోటిసులిచ్చి విచారణకు పిలవగా.. తాను అరండల్‌పేట స్టేషన్‌కు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలు చూశానని.. రాజ్యాంగం ద్వారా ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే మాట్లాడినట్లు బండారు సత్యనారాయణ తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలుచేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల. ఓటర్ల లిస్టులో తప్పు ఒప్పులను సరిచేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి.. జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. జగన్.. పోలీసులు లేకుండా కార్యకర్తలతో దమ్ముంటే వీధుల్లోకి రా అంటూ సవాల్ విసిరారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…