Balakrishna : నందమూరి బాలకృష్ణ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయనంత జోవియల్ పర్సన్ ఎవరూ ఉండరని దగ్గరి నుంచి చూసిన వారు చెప్తుంటారు. కాని ఒక్కోసారి బాలయ్య ఉగ్రరూపం చూసి భయపడిన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురంకు ఎమ్మెల్యేగానూ వ్యవహరిస్తున్న బాలకృష్ణ.. జనాల్లోకి వెళ్లినపుడు అభిమానంతో దగ్గరకు వచ్చే ఫ్యాన్స్‌పై చేయి చేసుకుంటారని కొన్ని సార్లు ట్రోల్ చేస్తుంటారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా తన పంథా మార్చుకోరు బాలయ్య. పైగా తన చేష్టలకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా అస్సలు చేయరు.
ఎవరి కోసమో తన లైఫ్‌స్టైల్ అస్సలు చేంజ్ చేసుకోవాలని బాలయ్య్ అస్సలు అనుకోరు. బాలయ్యతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు పనిచేసిన డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా తాజా ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అభిమానులను కొడతారనే అపవాదుకు బాలయ్య ఎలాంటి వివరణ ఇచ్చారో తెలిపారు. ‘హీరోలందరూ బౌన్సర్లను ఎందుకు పెట్టుకుంటున్నారు? ఫ్యాన్స్‌ను నెట్టి వేసేందుకు, కొట్టేందుకే కదా. నిన్నగాక మొన్న వచ్చిన చిన్న హీరోలు కూడా నలుగురు ఐదురుగు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు.
అంటే నా ఫ్యాన్స్‌ను కొట్టేందుకు డబ్బులిచ్చి బౌన్సర్లను పెట్టుకోవాలా? నేను ఆ పనిచేయను. అసలు వీళ్లందరూ డబ్బులిచ్చి బౌన్సర్లను ఎందుకు పెట్టుకున్నారు నాకు ఆన్సర్ చెప్పమనండి’ అని బాలయ్య తనతో అన్నట్లుగా సాయి మాధవ్ వెల్లడించారు. ఫ్యాన్స్ తనకు ఫ్యామిలీతో సమానమని, అలాంటి తన ఫ్యామిలీని కొట్టేందుకు వాడెవడు? అనేది బాలయ్య సిద్ధాంతమని , ఒకవేళ కోపమొస్తే ఓ దెబ్బ వేస్తానని.. వాళ్లకు కోపమొస్తే నా మీదకు వస్తారని.. అంతే తప్ప తమ మధ్యలో బౌన్సర్లు ఎవరని ఆయన ప్రశ్నించినట్లుగా చెప్పుకొచ్చారు. దీని గురించి ఎక్కడా ఓపెన్ గా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని బాలయ్య అన్నారని సాయి మాధవ్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…