Balakrishna : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో బిజీ అయ్యారు. ఆయన పలు ప్రెస్ మీట్స్‌లో ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ రాజకీయం మరింత రంజుగా మారేలా చూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టైన తర్వాత చంద్రబాబు అరెస్టుపై టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అయితే, దివంగత ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని బాలకృష్ణ అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని.. ఈ ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారన్నారు బాలకృష్ణ. అయితే, తెలంగాణలో మాత్రం కొందరు మూడు రోజుల నుంచి ఖండిస్తున్నారన్నారు. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు బాలకృష్ణ. కేసులకు అరెస్టులకు భయపడమని.. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు బాలకృష్ణ. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు స్పందించిన స్పందించకపోయిన నాకు అవసరం లేదు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయిన ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అనడం సరికాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలోపోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పుడు టైం వచ్చిందని.. తప్పకుండా టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమ కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను అందరూ ఖండిస్తున్నారు. అందరిలో ఆలోచన మొదలైంది అని అన్నారు బాలయ్య.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…