Balakrishna : సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి ఇప్పుడు రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టిన బాలకృష్ణ పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నాడు. రీసెంట్‌గా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. ఒక్కడే ఇంత చేశాడా అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఒక పౌరుడిగా ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరచింది. పార్టీ అధ్యక్షుడిగా స్పందించడం, ఆయన స్పందన అక్కడకక్కడ రావడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా కన్నా పౌరుడిగా ఆయన స్పందించారు అంటూ బాలకృష్ణ అన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని తెలిపారు. అయితే.. చంద్రాబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించక పోవడాన్ని తాను పట్టించుకోనన్నారు.
ఈ క్రమంలోనే.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ కొట్టిపారేశారు. ఇక రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలని.. వాళ్ల విషయంలో కలుగజేసుకుంటే.. బురద మీద రాయి వేస్తేనట్టేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. బీఆర్‌ఎస్ నేతలపై బాలకృష్ణ పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతిఒక్కరూ బాబు అరెస్టుని ఖండిస్తున్నారని, కానీ తెలంగాణలో కేవలం మూడు రోజుల నుంచి ఖండిస్తున్నారని అన్నారు. కేవలం ఓట్ల కోసం బీఆర్‌ఎస్ నేతలు ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని, ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలుగు వారి గౌరవం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీకి తాను అండగా ఉంటానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని చెప్పారు.
టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఇటీవల పవన్ వారాహి నాలుగో దశ యాత్రకు మద్ధతు ఇవ్వాలని నిర్నయించినట్లు బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు, నేతలు పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు దేవుడికైనా భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని.. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై స్కిల్ కేసును పెట్టారని ఆయన ఆరోపించారు.