Balakrishna : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్కొక్క‌రి తాట తీస్తాడు.. బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

Balakrishna : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు ఎంతో ఆస‌క్తిక‌రంగా మారాయి. చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్ తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ట్టు తెలియ‌జేశాడు. దీనిపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు విడుత వారాహి విజయ యాత్రను ప‌వ‌న్ ప్రారంభించనున్నారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఈ యాత్ర ప్రారంభిస్తుండటంతో మరింత ఆసక్తిని రేపుతున్నది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేపట్టనున్న వారాహి విజయ యాత్రకు తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతు ప్రకటించారు.

సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభిస్తున్న ఆయన యాత్రకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. దెబ్బకు దెబ్బ.. కోతకు కోత ఉంటుంది. కేసులకు, కోర్టులు, జైలు శిక్షకు భయపడేది లేదు. అవినీతి చేయని వాడు దేవుడికి కూడా భయపడడు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నాన్న నందమూరి తారక రామారావు చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసిస్తాం అని బాలకృష్ణ అన్నారు. బాల‌కృష్ణ వ్యాఖ్య‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ తన ప్రసంగంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ తొడగొట్టి మీసం తిప్పితే.. వెళ్లి సినిమాల్లో చేసుకో.. ఇక్కడ కాదు అని నా వృత్తిని అవమానించాడు. అతడు మీసం తిప్పితే.. రా తేల్చుకొందాం అని నేను మీసం మెలేసీ.. తొడగొట్టాను. రా తేల్చుకొందామని సవాల్ విసిరాను. నేను ఎవరికి భయపడే వాళ్లం కాదు. ప్రజా క్షేత్రంలో తేల్చుకొంటాం అని బాలకృష్ణ అన్నారు.

Balakrishna interesting comments on pawan kalyan
Balakrishna

నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తాజాగా వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ప్రకటించడంతో అవనిగడ్డలో జరగబోయే సభలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొనే చాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ గత కొద్ది రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నారు. పవన్ కల్యాణ్, కీలక నటులపై పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి చేసినట్టు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago