Balakrishna : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలియజేశాడు. దీనిపై వైసీపీ నాయకులు విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు విడుత వారాహి విజయ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఈ యాత్ర ప్రారంభిస్తుండటంతో మరింత ఆసక్తిని రేపుతున్నది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేపట్టనున్న వారాహి విజయ యాత్రకు తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతు ప్రకటించారు.
సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభిస్తున్న ఆయన యాత్రకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. దెబ్బకు దెబ్బ.. కోతకు కోత ఉంటుంది. కేసులకు, కోర్టులు, జైలు శిక్షకు భయపడేది లేదు. అవినీతి చేయని వాడు దేవుడికి కూడా భయపడడు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నాన్న నందమూరి తారక రామారావు చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసిస్తాం అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ తన ప్రసంగంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ తొడగొట్టి మీసం తిప్పితే.. వెళ్లి సినిమాల్లో చేసుకో.. ఇక్కడ కాదు అని నా వృత్తిని అవమానించాడు. అతడు మీసం తిప్పితే.. రా తేల్చుకొందాం అని నేను మీసం మెలేసీ.. తొడగొట్టాను. రా తేల్చుకొందామని సవాల్ విసిరాను. నేను ఎవరికి భయపడే వాళ్లం కాదు. ప్రజా క్షేత్రంలో తేల్చుకొంటాం అని బాలకృష్ణ అన్నారు.
నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తాజాగా వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ప్రకటించడంతో అవనిగడ్డలో జరగబోయే సభలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొనే చాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ గత కొద్ది రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నారు. పవన్ కల్యాణ్, కీలక నటులపై పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి చేసినట్టు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.
https://youtube.com/watch?v=A5SwCYC95io