Balakrishna : టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ 1980-90 నుంచే సంక్రాంతికి పోటీపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక ఏడాది చిరంజీవి సినిమా ఘన విజయం సాధిస్తే.. మరో ఏడాది బాలకృష్ణ సినిమా పైచేయి సాధించేది. చివరికి చిరంజీవి చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉండి 2017లో రీఎంట్రి ఇచ్చిన ‘ఖైదీ నెం 150’ సినిమాకి కూడా బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో పోటీ తప్పలేదు. ఆ ఏడాది రోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఇక ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో పలకరించారు. రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.
అయితే 2001లో సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. జనవరి 11వ తేదీన బాలయ్య నరసింహనాయుడు, చిరంజీవి మృగరాజు,14న వెంకటేష్ దేవి పుత్రుడు విడుదల కాగా, ఈ మూడు సినిమాల్లో మృగరాజు డిజాస్టర్ గా నిలిస్తే, వెంకటేష్ దేవి పుత్రుడు యావరేజ్ గా నిలిచింది. ఇక ఇందులో బాలయ్య నరసింహనాయుడు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతికి బాలయ్యకి పెద్ద అన్యాయమే జరిగిందట. ఆ అన్యాయం ఏంటంటే బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాకి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల కేవలం 14 థియేటర్లు మాత్రమే ఇచ్చారట.
మెజారిటీ థియేటర్లన్నీ చిరంజీవి మృగరాజు సినిమాకి మిగతావి వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాకు ఇచ్చారట . తమ అభిమాన హీరో సినిమాకి పెద్దగా థియేటర్స్ దక్కలేదని ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అయితే సినిమాలు విడుదలైన రెండు రోజులకి రిజల్ట్స్ బయటకు రావడంతో దాదాపు అన్ని థియేటర్స్ లో నరసింహనాయుడు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా 175 నుంచి 200 రోజుల వరకు ఆడి బంపర్ లాభాలు తెచ్చి పెట్టిందట. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 200 రోజులకు పైగా ఆడి రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం. నరసింహనాయుడు చిత్రంపై చెప్పలేనన్ని రికార్డ్స్ ఉన్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…