Balakrishna : ఇటీవల రామ్ చరణ్.. నందమూరి ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా మెలుగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో ముందు నుండే ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా పాకేలా చేసింది. ఇక ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగగా, ఆ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. చంద్రబాబు పక్కన ఆయన కూర్చోగా, బాలయ్య కూడా రామ్ చరణ్‌కి సాదర స్వాగతం పలికారు. ఇక శర్వానంద్ పెళ్లిలో కూడా ఒకరినొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు.
శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు మరియు ఇతర రంగాలకు చెందిన వారు హాజరు అయ్యారు. ఆ సమయంలోనే రామ్ చరణ్ దంపతులు రిసెప్షన్ కు హాజరు అయ్యి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తిరిగి వెళుతున్న సమయంలో బాలకృష్ణ అక్కడికి వచ్చారు. రామ్ చరణ్, బాలయ్య ఎదురు ఎదురు పడగా.. బాలయ్యకు రెండు చేతులతో నమస్కారం చేసిన రామ్ చరణ్.. ఆ తర్వాత దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు.
బాలకృష్ణ కూడా రామ్ చరణ్‌ను చూసి భుజం తట్టి, పలకరించారు. కుశల ప్రశ్నలు అడిగారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రామ్ చరణ్ సంస్కారం ఇది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు మెగా అభిమానులు. బాలయ్య ఫ్యాన్స్ కూడా వీరిద్దరినీ ఒకే ఫ్రేములో చూసి పండగ చేసుకుంటున్నారు. గతంలో కూడా అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ వచ్చినప్పుడు..రామ్ చరణ్‌తో బాలకృష్ణ మాట్లాడిన సంగతి విదితమే. మరోసారి పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఫన్నీగా చరణ్ ను ‘ఫిట్టింగ్ మాస్టర్’అంటూ .. అతడు తండ్రి కాబోతున్నందుకు విష్ కూడా చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…