Balagam Venu : మున్నా చిత్రం లో వేణు టిల్లు గా యావత్ సినీ ప్రేక్షకులను అలరించిన వేణు.. బలగం మూవీ తో డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్న విషజ్ఞం తెలిసిందే. బలగం సినిమాల ఎలాంటి అంచనాలు లేకుండా తెలంగాణ నేపధ్య కథగా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ తో వరుసగా అగ్ర నిర్మాతల నుండి చినన్ నిర్మాతల వరకు వేణు తో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా ఫై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణు తన రెండో సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. రెండో సినిమా కచ్చితంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు.
ఇప్పటికే రాజుకు ఓ కథ కూడా చెప్పానని తెలిపాడు. దానికి దిల్ రాజు కొన్ని సూచనలు చేశారన్నాడు. అవి తనకు కొత్త కిక్ ఇచ్చాయని తెలిపాడు. రాజు సూచనలకు అనుగుణంగా కథను తీర్చిదిద్దుతానని చెప్పాడు. ప్రస్తుతం బలగం సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన వేణు నటుడిగానూ కొనసాగుతానని స్పష్టం చేశాడు. నిజానికి రెండో సినిమా అంటే నాకూ టెన్షన్ గానే ఉంది. మొదటి సినిమా విజయం నాపై ఉంచిన బాధ్యత అలాంటిది. 2007 లో ‘మున్నా’ సినిమాతో నాకు గుర్తింపునిచ్చింది దిల్ రాజు గారే.
మళ్లీ ఆయన వల్లే జబర్దస్త్ వేణుగా ఉన్న నాకు బలగం ఇంటి పేరుగా మారింది అని ఆయన చెప్పారు. కచ్చితంగా రెండో సినిమా ఆయనతోనే తీస్తాను. ఇప్పటికే ఆయనకు ఒక కథ వినిపించాను. దానికి ఆయన ఇచ్చిన సూచనలు కొత్త కిక్ ను ఇచ్చాయి. త్వరలోనే దానిపై పనిచేస్తాను. ప్రస్తుతం బలగం సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. అటు నటుడిగా వచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోను’’ అంటూ వేణు చెప్పుకొచ్చాడు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం చిత్రం మంచి హిట్ కొట్టగా, ఇప్పుడు ఈ సినిమా కోసం పల్లెటూర్లలోని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…