ఇటీవల చిన్న సినిమాగా విడుదలైన పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం. ఈ చిత్రంలో “కాకి” అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు.. అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది..ఎందుకంటే కాకి అంటే కాలజ్ఞాని అని అందుకే కాకికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాకి ముట్టుడు అనే కాన్సెప్ట్‌తో బలగం చిత్రం చేయగా, దీనిపై కాపీ ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇద తెలుగు సంప్రదాయమని, దాన్ని కాపీ కొట్టడం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాడు వేణు. ఈ పిట్ట ముట్టుడు కాన్సెప్ట్ పై ఎవరైనా సినిమా తీయొచ్చు. బలగం కథ నాది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో మాట్లాడండి. దిల్ రాజు గారికి సంబంధం లేదు. ఆయన కోర్టుకు వెళ్తానంటున్నాడు. ఆయన కంటే ముందు నేను కోర్టుకు వెళ్తాను అంటూ వేణు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమాలలో జంతువులని ఉపయోగిస్తే ఎక్కువగా సింహం, పులి లాంటి వాటిని ఎక్కువగా చూపిస్తారు.ఇక బోయపాటి అయితే ఎద్దుల్ని ఎక్కువగా తన సినిమాల్లో చూపిస్తుంటాడు. కాని బలగం, విరూపాక్ష సినిమాలలో కాకి కీలక పాత్ర పోషించింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ ఆధారంగా తీసిన ‘విరూపాక్ష’ చేతబడి, తాంత్రిక విద్య లాంటి మూఢ నమ్మకాల ఆధారంగా తెరకెక్కగా, దీనికి సైంటిఫిక్ లింక్ చేసే ప్రయత్నం చేశారు. హారర్ ఎలిమెంట్స్ తో చిత్రం తీసారు కాబట్టి.. ఇందులో తాంత్రిక విద్యలని చూపిస్తూ కాకిని ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. ఎంట్రీలోనే హీరోకి కాకి షాకిస్తుంది. ఆ తర్వాత స్టోరీలో మనుషులు చనిపోవడానికి, ప్రేక్షకుల్ని భయపెట్టడానికి కూడా కారణమవుతూ ఉంటుంది.
విరూపాక్ష’లో చాలా చోట్ల హీరోహీరోయిన్ తర్వాత కాకి మాత్రమే ఎక్కువగా కనిపించింది. కాకి చిత్రంలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పొషించింది. దగ్గర్లోని థియేటర్ కి వెళ్లి ఈ మూవీ చూస్తే కాకి సెంటిమెంట్ ఏంటనేది అర్ధమవుతుంది. మామూలుగా సినిమా అంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత అంటూ ఇలా చాలామంది విజయంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు.కానీ వీరు మాత్రమే కాకుండా ఇలా ప్రముఖ పాత్ర వహిస్తున్న వారిలో ప్రముఖంగా కాకి కీలక పాత్ర పోషిస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.