Baahubali Prasad : జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెలరేగిపోతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు జగన్ పై నిప్పులు చెరుగుతున్న పవన్ కళ్యాన్ రీసెంట్‌గా సీఎం జగన్ కి కొత్త పేరు పెట్టారు జగన్. జగ్గూ భాయ్ అని సంబోధిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పవన్ వాపోయారు. నేను నా కోసం పోరాటం చేయడం లేదు. నిస్సహాయతలో ఉన్న ప్రజల కోసమే నా పోరాటం. అధికారం కోసం కాదు మార్పు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. మన దగ్గర సమర్థత ఉంది కాబట్టే దేశ ప్రధాని నాకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. జగన్ అనే వాడు రౌడీ పిల్లాడు. జగ్గూ భాయ్ ని ఎలా కంట్రోల్ చేయాలో జనసేనకు బాగా తెలుసు అని పవన్ కల్యాణ్ అన్నారు.
తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించగా, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తన చెప్పులు మీద పంచ్‌లు విసిరారు. మొన్న అన్నవరం వెళ్లినప్పుడు నా చెప్పులు బండిలో వదిలేస్తుంటే మనోహర్ గారు అడ్డుపడ్డారు. ఇక్కడ చెప్పులు పోవని మాటిచ్చారు. సరే అని గుడి బయట చెప్పులు వదిలేశాను. అక్కడే నాకేదో తెలిసిన ముఖమేదో కనిపించింది. ఈ ముఖాన్ని ఎక్కడ చూశానో అనుకున్నా. తర్వాత చెప్పులు పోయాయి. నీ చెప్పులు మచిలీపట్నంలో కనిపించినట్లు ఎవరో చెప్పారు. కొన్నేళ్ల క్రితం అత్తారింటికి దారేది రిలీజైతే దాని పైరసీ కాపీలు కూడా మచిలీపట్నంలో తేలాయి. రెండింటికీ మధ్య ఏదో కనెక్షన్ ఉంది. దీని గురించి మనందరం ఆలోచించాలి అని అత్తారింటికి దారేది నిర్మాత భోగవల్లి ప్రసాద్ తో అన్నారు పవన్.
కాగా కొద్ది రోజుల క్రితం ఈ నిర్మాత జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ మధ్య కూడా పవన్ తన చెప్పులు పోయాయని, కనిపిస్తే చెప్పండని చెప్పగా, దానిపై పేర్ని నాని స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ రెండు చెప్పులూ పోయాయని ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. చెప్పులు పోయిన సంగతి పవన్ కు మూడు రోజుల తర్వాత గుర్తుకు వచ్చిందా అని పేర్నినాని ప్రశ్నించారు. చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తారులే కానీ, జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపోయింది, దాన్ని ముందు వెతుక్కోమని హితవు పలికారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…