Arjun Reddy Movie : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా కథలు మరో హీరో వద్దకు వెళ్లడం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధారణమే. అలాంటిదే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా విషయంలో జరిగింది. విజయ్ దేవరకొండ నీ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చిన సినిమా అర్జున్ రెడ్డి.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రౌడీ విజయ్ దేవరకొండ యాక్షన్.. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. డాక్టర్ గా మాత్రమేగాక మాస్ యాంగిల్.. ఓ క్లాస్ కుర్రాడు లో చూపించటం లో… ముఖ్యంగా ఈ తరానికి నచ్చే రీతిలో తెరకెక్కించడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సింపుల్ కాన్సెప్ట్ కానీ పెళ్లైన తరవాత కూడా హీరోయిన్ తిరిగి తన ఇంటికి తీసుకెళ్లడమే ఈ సినిమాలో కొత్తదనం… అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవల్ ఉంటాయి.
దానికి తోడు విజయ్ దేవరకొండ, షాలిని పాండే ల నటన కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్క సినిమాతోనే ఆమెను ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా మారిపోయింది. అయితే ముందుగా సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు హీరోగా శర్వానంద్ ను అనుకున్నాడట. కానీ శర్వానంద్ సినిమాలో ముద్దులు.. ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నాయని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు ఆఫర్ వచ్చింది. సందీప్ మొదట హీరోయిన్ గా పార్వతి నెయిర్ ను అనుకున్నాడట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో షాలినీ పాండేను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇలా అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ, షాలిని పాండే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…