నందమూరి బాలకృష్ణకి వివాదాలు కొత్తేమి కాదు. ఆయన నోటి దురుసు వలన పలు వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతూ ఉంటాడు. రీసెంట్‌గా వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో అక్కినేని తొక్కినేని అంటూ నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరుపై ఎ.ఎన్.ఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. బాలయ్య తప్పుగా మాట్లాడరని, ఆయన సారీ చెప్పాలంటూ పలువురు ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ వార్త బయటకు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు తన సొంత కొడుకు అయిన నాగార్జున కంటే బాలకృష్ణని బాగా చూసుకునే వారట.
బాలకృష్ణతో చాలా సరదాగా మాట్లాడేవారని, చాలా విషయాలు షేర్ చేసుకునేవారని, ఏఎన్ఆర్ బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉండేదని, ఈ విషయం నాగార్జున కూడా తెలుసని చెబుతున్నారు. ఈ విధంగా ఏఎన్ఆర్ తన కన్న కొడుకు కంటే ఎక్కువగా బాలకృష్ణని చూసుకున్నా కూడా ఏఎన్ఆర్ ను ఈ విధంగా బాలకృష్ణ విమర్శించడం అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తోంది. అయితే రీసెంట్‌గా హిందూపురంలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాలకృష్ణ. ఈ క్రమంలో వివాదంపై స్పందిస్తూ.. నేనెంటో ప్రజలకు తెలుసు. రామారావుగారిని ఎన్టీరోడు అని అంటారా లేదా.. అలాగే నాగేశ్వరరావుగారిని నాగయ్యగారు అని అంటారు. రాష్ట్రంలో ఒక్కొక్క యాస, అభిమానంతో పిలుస్తుంటారు.
నేను కూడా ప్రచారానికి వెళ్లినప్పుడు నన్ను చూసి ఏదో ఒక పేరుతో వెళ్లిపోతున్నాడురా అని అంటారు. కూలీ పని చేసుకునేవాళ్లు… వాళ్లు వీళ్లు అభిమానంతో పిలుచుకుంటారు. అలాగే మనకు ఆప్తులైన వారిని మనం అలాగే పిలుచుకుంటాం. నాగేశ్వరరావుగారు నాకు బాబాయే. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సొంత పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. మా మధ్య అంత ఆప్యాయత ఉంది. ఇండస్ట్రీకి రెండు కళ్లు. అందులో ఒకరు నాన్నగారు అయితే మరొకరు బాబాయ్ ఎ.ఎన్.ఆర్‌గారు. నాన్నగారి నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటే..బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండటాన్ని నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చారు.