Anemia : స్త్రీలు, పిల్లల్లో కనబడే ముఖ్యమైన అనారోగ్య సమస్య రక్తహీనత. దీన్నే ఎనీమియా అంటారు. ముఖ్యంగా మూడు కారణాల వల్ల రక్తం తక్కువ అవుతుంది. అందులో పౌష్టికాహార లోపం ఒకటి. ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల రక్తం తగ్గుతుంది. మరొకటి రక్తం నష్టపోవడం. స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో నులిపురుగుల వల్ల క్రమేపి రక్తాన్ని కోల్పోయి రక్తహీనతకి గురవుతారు. అయితే అన్ని జబ్బులకూ మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే.. రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా. రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో, లేదో వైద్యుడిచే పరీక్షలు చేయించుకుని ఆ మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. రక్తహీనత ఉన్నవారి చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది. లేదా బూడిదరంగులోనూ కొందరి చర్మం దర్శనమిస్తుంది. రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కనుక చర్మం రంగు మారుతుంది. ఇలా గనక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి.
శరీరంలో తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఛాతి భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతి నొప్పి వస్తుంది కనుక.. వైద్యున్ని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు. రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది. ఈ రకమైన వింత లక్షణాలు ఉంటే దాన్ని రక్తహీనతేమో అని అనుమానించాలి. తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు. ఈ క్రమంలో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తే తలనొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి పరీక్షలు చేయించుకుని, ఆ విషయాన్ని నిర్దారించుకుని మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు. శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కారణం అయి ఉండవచ్చు. ఎందుకంటే శరీరంలో తగినంత రక్తం ఉంటే అన్ని భాగాలకు ఉష్ణం సరిగ్గా సరఫరా అవుతుంది. దీంతో శరీరం వేడిగా ఉంటుంది. ఇక రక్తం లేకపోతే శరీరం చల్లగా ఉంటుంది. కనుక శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉంటున్నా కూడా అనుమానించాలి. ఇది రక్తహీనత అయి ఉండవచ్చు. ఒక్కసారి పరీక్షలు చేయించుకుంటే తేలిపోతుంది. దీంతో రక్తహీనత ఉందీ.. లేనిదీ.. నిర్దారించుకోవచ్చు. రక్తహీనత లేకపోతే ఓకే. రక్తహీనత ఉంటే మాత్రం డాక్టర్ సూచన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. దీంతో రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…