ఏపీలో ఇంటర్మీడియట్‌కు గాను సప్లిమెంటరీ పరీక్షల హాట్ టిక్కెట్లను ఇటీవలే విడుదల చేశారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ సబ్జెక్టులను చదివే విద్యార్థులు ఏపీకి చెందిన ఇంటర్ బోర్డు అధికారిక సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విద్యార్థులు తమ పాత హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ కార్డు నంబర్‌తోపాటు పుట్టిన తేదీ వివరాలను లేదా పేరును నమోదు చేయాలి. దీంతో హాల్ టికెట్‌ను ఇస్తారు. ఇక ఏపీలో ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1456 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 2,41,591 మంది అంటే.. 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించారు. అలాగే సెకండ్ ఇయర్‌లో 2,58,449 అంటే.. 61 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. ఇక పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు.
ఆగస్టు 3 నుంచి 12 వరకు ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో భాగంగా ఆగస్టు 3న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది. 4వ తేదీన ఇంగ్లిష్, 5న మ్యాథ్స్ పేపర్-1ఎ, సివిక్స్, బోటనీ, ఆగస్టు 6న మ్యాథ్స్-1బి, హిస్టరీ, జువాలజీ పరీక్షలను నిర్వహిస్తారు.
ఇక ఆగస్టు 8న ఫిజిక్స్, ఎకనావిుక్స్, 10న కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 11న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు), 12న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు ఉంటాయి.
అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల విషయానికి వస్తే.. ఆగస్టు 3న సెకండ్ లాంగ్వేజ్, 4న ఇంగ్లీష్, 5న మ్యాథ్స్ పేపర్-2ఏ, సివిక్స్, బోటనీ, 6న మ్యాథ్స్-2బీ, హిస్టరీ, జువాలజీ, 8న ఫిజిక్స్, ఎకనావిుక్స్, 10న కెవిుస్ట్రీ, సోషియాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 11న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (Bipc విద్యార్థులకు), 12న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు ఉంటాయి.
ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఆగస్టు 17 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను ఆగస్టు 24న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఆగస్టు 26న నిర్వహిస్తారు. కాగా ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…